స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సదుపాయాలతో పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్

- February 07, 2025 , by Maagulf
స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సదుపాయాలతో పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్

విజయవాడ: గడచిన రెండున్నర దశాబ్దాలుగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్న పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ ను స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మల్టీ స్పెషాలిటీ, ట్రామా, క్రిటికల్ కేర్ సెంటర్ గా ఆధునీకరించామని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు తెలిపారు.రాష్ట్రంలోనే అతిపెద్ద క్రిటికల్ కేర్ సెంటర్ గా ఆధునీకరించబడిన నూతన హాస్పిటల్ ను ఈ నెల 9వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నారు.ఈ నేపథ్యంలో, సూర్యారావుపేటలోని పెద్దేశ్వర్ హెల్త్ సెంటర్ నందు శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు మాట్లాడుతూ..పాతికేళ్ల క్రితం, 1999లో 20 పడకల ఆసుపత్రిగా తమ ప్రస్థానం ప్రారంభమైందని చెప్పారు.అక్కడి నుంచి రెండేళ్లలో 50 పడకల హాస్పిటల్ గా అభివృద్ధి చేశామని, 2007లో క్యాథ్ ల్యాబ్ ఏర్పాటుచేశామని, 2011లో బైపాస్ సర్జరీలను ప్రారంభింవమని తెలియజేశారు.ఈ రెండున్నర దశాబ్దాల ప్రయాణంలో అనేక మైలురాళ్లను విజయవంతంగా అధిగమించామని..100 పర్సెంట్ సక్సెస్ రేటుతో ఏడువేలకు పైగా బెలూన్ యాంజియోప్లాస్టీలు నిర్వహించామని,31 వేలకు పైగా యాంజియోగ్రాంలు, 99.97 శాతం సక్సెస్ రేటుతో 5,747 సీటీ సర్జరీలు, వంద శాతం సక్సెస్ రేటుతో 1,366 ప్రైమరీ పీటీసీఏఎస్ చికిత్సలు చేశామని వెల్లడించారు. ఎప్పటికప్పుడు అత్యాధునిక పరిజ్ఞానాన్ని సముపార్జించుకుంటూ 10 లక్షల మందికి పైగా పేషెంట్లకు చికిత్సలందించామని పేర్కొన్నారు. ‘కార్పొరేట్ క్వాలిటీ..ఎఫర్డబుల్ రియాలిటీ’ నినాదంతో ఈ ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు.గతేడాది హాస్పిటల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తన కుమారుడు డాక్టర్ పల్లెం ఆకాశ్ నేతృత్వంలో, ప్రజలకు మరింత విస్తృతంగా సేవలందించాలనే సంకల్పంతో ప్రపంచ స్థాయి సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ సెంటర్ గా పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటరును అభివృద్ధి చేశామని డాక్టర్ పెద్దేశ్వరరావు వివరించారు. అనంతరం, డాక్టర్ పల్లెం ఆకాశ్ మాట్లాడుతూ..రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో అతిపెద్ద క్రిటికల్ కేర్ సెంటర్ గా తమ హాస్పిటల్ ను తీర్చిదిద్దామన్నారు. మొత్తం 150 బెడ్లు.. 8 ఐసీయూలతో 100 క్రిటికల్ కేర్ బెడ్లతో వివిధ విభాగాల వైద్య సేవలను ఒకేచోట అందిస్తామని తెలిపారు. కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, పల్మనాలజీ, క్రిటికల్ కేర్, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ట్రామా తదితర విభాగాలకు సంబంధించిన అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ నందు సేవలందిస్తారని డాక్టర్ ఆకాశ్ వివరించారు.ఈ నెల 9వ తేదీ జరిగే ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, స్టార్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ మన్నం గోపీచంద్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ సీహెచ్. ప్రసాద్ బాబు, డాక్టర్ ఎస్. భాను ప్రభాకర్, డాక్టర్ వి.సుశాంత్ రెడ్డి, డాక్టర్ సింధు చాగంటి, డాక్టర్ పవన్ సాయి పోతుల, డాక్టర్ కె. శ్రీనివాస్ బాబు, డాక్టర్ రామ్ ప్రతాప్ కొనకళ్ల, డాక్టర్ కె.రామ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com