వెదర్ అలెర్ట్ జారీ..ఈ వారాంతంలో తీరంలో ఎత్తైన అలలు..!!
- February 07, 2025
దోహా, ఖతార్: ఈ వారాంతంలో సమద్రం అల్లకల్లోకంగా ఉంటుందని, బలమైన గాలులు వీస్తాయని ఖతార్ వాతావరణ విభాగం (QMD) అలెర్ట్ జారీ చేసింది. తీరం వెంబడి స్థిరమైన బలమైన గాలి కారణంగా ఎత్తైన అలలు ఉంటాయని తెలిపింది. ఆగ్నేయం నుండి దక్షిణ దిశగా గాలులు 12 నుండి 22 నాట్‌లకు చేరుకుంటాయని పేర్కొంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి, రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపింది. పగటిపూట గరిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్ రాత్రికి 18 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయని వెల్లడించింది. తీరం వెంట అలల ఎత్తు 3 నుండి 7 అడుగుల వరకు ఉంటుందని, కొన్ని సమయాల్లో అవి 11 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. నివాసితులు, సందర్శకులు తమ ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా సముద్ర కార్యకలాపాలలో పాల్గొనే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







