కువైట్ లో మినిమం బ్యాంక్ బ్యాలెన్స్‌, డేటా అప్‌డేట్‌ ఫీజులు రద్దు..!!

- February 07, 2025 , by Maagulf
కువైట్ లో మినిమం బ్యాంక్ బ్యాలెన్స్‌, డేటా అప్‌డేట్‌ ఫీజులు రద్దు..!!

కువైట్: సాలరీ ఖాతాలో కాకుండా ఇతర ఖాతాలలో కనీస నిల్వను ఉంచడంలో విఫలమైతే విధించే రెండు దినార్ల రుసుమును నిలిపివేయాలని కువైట్ సెంట్రల్ బ్యాంక్ బ్యాంకులను ఆదేశించింది. కొన్ని బ్యాంకులు 100 దీనార్‌ల కంటే తక్కువ నిల్వ ఉన్న ఖాతాల నుండి నెలకు రెండు దినార్‌లను మినహాయించుకుంటాయని నివేదికలు చెబుతున్నాయి. కొన్ని బ్యాంకులు తమ బ్యాలెన్స్ నిర్దిష్ట విలువ కంటే తక్కువగా ఉంటే, సాలరీ అకౌంట్ కాకుండా, వివిధ ప్రైజ్ మనీ ఖాతా, మైనర్ ఖాతా మొదలైన ఇతర ఖాతాల నుండి రెండు దీనార్‌లను రుసుముగా తీసుకుంటున్నాయి. ఈ రుసుమును వసూలు చేయడాన్ని నిలిపివేయాలని సెంట్రల్ బ్యాంక్ అన్ని బ్యాంకులను ఆదేశించింది. కొన్ని బ్యాంకులు తమ బ్రాంచ్‌లలో కస్టమర్ డేటాను అప్‌డేట్ చేయడానికి వసూలు చేసే 5 దినార్ల రుసుమును కూడా రద్దు చేయాలని సెంట్రల్ బ్యాంక్ బ్యాంకులను ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com