యూఏఈ అమ్ములపొదిలో అధునాతన వార్ షిప్..!!
- February 08, 2025
యూఏఈ: అత్యున్నత అంతర్జాతీయ మిలిటరీ స్పెసిఫికేషన్లతో రూపొందించబడిన అత్యాధునిక నౌకాదళ నౌకను షేక్ హమ్దాన్ ప్రారంభించారు.ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు.ఈ నౌక తన రక్షణ కార్యకలాపాలను బలోపేతం చేయడంతోపాటు సముద్ర భద్రతను మరింత పెంచుతుందని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఉప ప్రధాన మంత్రి, యూఏఈ రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పేర్కొన్నారు. అల్ ఎమారత్ కొర్వెట్ (P111) వైపు రెడ్ కార్పెట్‌పై నడిచే ఫోటోలు, వీడయోను షేర్ చేశారు.ఈ సందర్భంగా యుద్ధనౌక రూపకల్పన,అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వారిని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ ప్రశంసించారు.
కొత్త యుద్ధనౌకలో అత్యాధునిక పనోరమిక్ సెన్సార్లు, బ్రేక్ లేని డేటా సేకరణ, ప్రాసెసింగ్ కోసం రూపొందించబడిన అధునాతన సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ యూనిట్ ఉన్నాయి.ఇది రాడార్లు, ఎలక్ట్రో-ఆప్టికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్, కమ్యూనికేషన్ యాంటెన్నాలతో సహా హై-టెక్ సెన్సార్ సిస్టమ్‌లను కలిగి ఉంది.ప్రత్యేక వాతావరణ వ్యవస్థలతో పాటు దాని కార్యాచరణ సంసిద్ధతను సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







