ఈద్ పండుగ సందర్భంగా ఖతార్ లోని మాల్స్ లో భద్రతా ఏర్పాట్లు
- July 10, 2015
ఖతార్ టూరిజం ఆధారిటీ వారు వచ్చే వారాంతంలో ఏర్పాటు చేయనున్న ఈద్ ఉల్ ఫిత్ర్ ఉత్సవాలకు దేశంలోని మాల్స్ అన్ని సర్వాంగసుందరంగా సిద్ధం కానున్నాయి. ఈ పండుగ, కతార్ యొక్క ఇవెంట్ కేలండర్లో ప్రధమ స్థానాన్ని ఆక్రమించి ఉన్నందున, చుట్టుపక్కల దేశాలనుం డి కూడా ప్రజలు సంస్కృతి, వారసత్వాల సమ్మేళ నానికి, సకుటుంబ వినోదానికి దీనిని ఒక వేదికగా ఎంచి పెద్దసంఖ్యలో విచ్చెస్తారు. ఈవిధంగా వచ్చే అతిధులకు, స్థానికులకు కూడా భద్రతా ఏర్పాట్లు చేశామని మాల్ అధికారులు హామీ ఇచ్చారు. ఈ మాల్స్ లో, పీటర్ పాన్ (సిటీ సెంటర్ దోహా), సర్కస్ కెనడా (అల్ ఖోర్ మాల్), జంగిల్బుక్ (లాగూనా మాల్), పినొచియో (హైయత్ ప్లాజా షాపింగ్ మాల్), ద లిటిల్ ప్రిన్స్ (దార్ అల్ సలాం మాల్) ఇంకా మీట్ ద నిక్ టూన్స్ (ఏజ్డాన్ మాల్) వంటి వైవిధ్యమైన షోలు ఉంటాయి. పెద్ద సంఖ్యలో విచ్చెసే వారి భద్రత కోసం ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనగలిగే పూర్తి శిక్షణ పొందిన టీమ్ ఏర్పాటుచేయడమే కాక, ఎప్పటికప్పుడు భవనాల యొక్క ఫైయర్ సేఫ్టీ ప్లాన్ ను సమీక్షిస్తామని హయాత్ ప్లాజా షాపింగ్ మాల్ జనరల్ మ్యానేజర్ ఫిరోజ్ మొయిదీన్ తెలియజేశారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







