ఒమన్‌లో 3-5 స్టార్ హోటళ్ల ఆదాయం 243.3 మిలియన్లు..!!
- February 09, 2025
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోని (3-5) స్టార్ హోటళ్ల ఆదాయం డిసెంబర్ 2023 చివరి నాటికి OMR229, 256,000తో పోలిస్తే డిసెంబర్ 2024 చివరి నాటికి 6.2 శాతం పెరిగి OMR243,356,000కి చేరుకుంది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ విడుదల చేసిన గణాంకాలు.. మొత్తం హోటల్ అతిథుల సంఖ్యలో 3.6 శాతం పెరుగుదలను, డిసెంబర్ 2024 చివరి నాటికి 2,145,579 మంది అతిథుల సంఖ్య(2 శాతం వృద్ధి రేటు) నమోదైందని వెల్లడించింది.
ఇందులో ఒమానీ అతిథుల సంఖ్య 4.5 శాతం పెరిగి 804,291 మందికి చేరుకోగా, గల్ఫ్ అతిథుల సంఖ్య 198,535కి చేరుకుంది. ఇతర అరబ్ అతిథుల సంఖ్య 10.3 శాతం పెరుగుదలతో 103,034కి చేరుకుంది. అయితే యూరోపియన్ అతిథుల సంఖ్య 4.3 శాతం పెరిగి 539,470కి చేరుకుంది. అమెరికా నుండి వచ్చిన అతిథుల సంఖ్య 6.9 శాతం పెరుగుదలతో 61,751కి చేరుకుంది. అయితే ఆఫ్రికా ఖండం నుండి వచ్చిన అతిథుల సంఖ్య 9.2 శాతం పెరిగి 12,742కి చేరుకుంది. ఆసియా అతిథుల సంఖ్య 4.7 శాతం పెరిగి 311,150కి చేరుకుంది. ఓషియానియా నుండి 33,052 మంది అతిథులు రాగా, ఇది 26.1 శాతం తగ్గుదలని నమోదు చేసిందని గణంకాలు తెలిపాయి.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







