రిలీజ్ కి ముందే థియేటర్లో 'అరి' సినిమా చూడాలనుకుంటున్నారా?
- February 10, 2025
            పేపర్ బాయ్ సినిమాతో మంచి విజయం అందుకున్న డైరెక్టర్ జయ శంకర్ ఇప్పుడు అరి అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్నాడు.ఇప్పటికే ఈ సినిమా పూర్తయింది.ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. సైకో మైథలాజికల్ థ్రిల్లర్‌గా ఈ అరి సినిమా తెరకెక్కింది. భగవద్గీత సారాన్ని ఈ అరి సినిమాలో చూపించారు. ఇప్పటికే ఈ సినిమాను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలువురు మఠాధిపతులు, స్వామిజీలకు చూపించగా అభినందించారు.
ఈ సినిమాలో అనసూయ, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష.. లాంటి పలువురు నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అరిషడ్వర్గాల మీద ఈ సినిమాని నిర్మించారు. అయితే ఈ అరి సినిమా అధికారిక రిలీజ్ కి ముందే కొంతమందికి స్పెషల్ షో చూపించనున్నారు.
ఈ మేరకు దర్శకుడు జయశంకర్ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ సినిమా గురించి పెట్టి సినిమా లవర్స్ ముందే ఈ సినిమాను చూడాలనుకుంటే తాను ఇచ్చిన వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయమని, లేదా ఇచ్చిన స్కానర్ ని స్కాన్ చేసి డీటెయిల్స్ పంపమని తెలిపారు. మరి ఈ మైథలాజికల్ థ్రిల్లర్ అరి సినిమాని మీరు ముందుగానే చూడాలనుకుంటే దర్శకుడు ఇచ్చిన పోస్ట్ ప్రకారం డీటెయిల్స్ పంపించండి.
కొత్తగా సినిమా చేయడమే కాదు ఇలా కొత్తగా కూడా ప్రమోట్ చేస్తున్నారు మూవీ యూనిట్. అలాగే పలు అవార్డు ఫిలిం ఫెస్టివల్స్ కు అరి సినిమాని పంపిస్తున్నారు. అధికారికంగా త్వరలోనే అరి సినిమాని రిలీజ్ చేయనున్నారు.ఇక అరి తర్వాత డైరెక్టర్ జయశంకర్ బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా ఒక సినిమాని ఓకే చేసారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
 - ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 - బహ్రెయిన్ లో 52 నకిలీ సంస్థలు.. 138 వర్క్ పర్మిట్లు..!!
 - లండన్‌లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్‌తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 







