వర్క్ పర్మిట్ ఉల్లంఘనలకు భారీగా ఫైన్లు..షురా కౌన్సిల్ ఆమోదం..!!
- February 10, 2025
మనామా: కార్మిక ఉల్లంఘనలకు భారీ మొత్తంలో జరిమానాలు విధించనున్నారు.ఈ మేరకు ప్రతిపాదనలకు షురా కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 2024 చివరి రోజున పార్లమెంటు ఇప్పటికే ఆమోదించిన ప్రకారం..BD100 నుండి BD300 జరిమానాలు పెరిగాయి.తాజాగా వాటిని BD1,000 కి పెంచారు. అయితే, భారీ జరిమానాలు ప్రారంభమయ్యే ముందు గడువు ముగిసిన వర్క్ పర్మిట్‌లను క్రమబద్ధీకరించడానికి సంస్థలకు 14 రోజుల వరకు అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించారు. గత సంవత్సరం ఆగస్టులో హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా జారీ చేసిన డిక్రీ-లా ను ఇప్పుడు ఎగువ సభ ఆమోదించింది.
కమిటీ రిపోర్టర్ తలాల్ మహ్మద్ అల్ మనాయ్ మాట్లాడుతూ.. చట్టాన్ని అనుసరించేలా చూసుకుంటూ వ్యాపారాలు కొనసాగేలా అన్ని చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపారు. "చాలా ఉల్లంఘనలు చెడు ఉద్దేశాలతో జరగవు. కానీ వ్యాపారాన్ని నిర్వహించడంలో రోజువారీగా కొంత గందరగోళం ఉంటుంది. ఈ డిక్రీ-చట్టం కంపెనీలు పరిస్థితులకు సరిపోని జరిమానాల కింద అణిచివేయబడకుండా కట్టుబడి ఉండేలా చేస్తుంది ”అని వివరించాడు. తాత్కాలిక కార్మిక మంత్రి యూసిఫ్ ఖలాఫ్ పాత నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని పేర్కొన్నారు.
షూరా కౌన్సిల్ యొక్క డిప్యూటీ చైర్‌పర్సన్ డాక్టర్ జెహాద్ అల్ ఫదేల్ మాట్లాడుతూ.. ఈ మార్పు అవసరమని అన్నారు. “ఇది దిద్దుబాటు. శిక్ష కాదు. వ్యాపారాలను మూసివేయడానికి జరిమానా విధించడం కాదు, తప్పులను సరిదిద్దడంలో వారికి సహాయపడటం లక్ష్యం. ”అని చెప్పారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







