ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక: సీఎం రేవంత్
- February 10, 2025
హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఊరుకునేది లేదని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇసుక మాఫియాను కట్టడి చేయాలని, రీచ్‌లలో తక్షణమే తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈరోజు (సోమవారం) గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ క్రమంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాను నిరోధించే బాధ్యతను హైడ్రాకు అప్పగించారు.
అక్రమ రవాణాకు సహకరించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు. అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా జరగాలని, విధి నిర్వహణలో పర్మనెంట్ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించాలంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని… అందుకు జిల్లాల వారిగా కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్‌తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్లు…. 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలన్నారు.
రవాణాకు సంబంధించి రిజిస్టర్డ్ లారీలను ఎంప్యానెల్ చేయాలి. ఇసుక రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి. ఇసుక బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలి. సమస్య తలెత్తినప్పుడు వెంటనే పరిష్కారం జరగాలి.
రిజిస్టర్డ్ లారీలను మాత్రమే రవాణా చేయడానికి ఎంప్యానెల్ చేయాలని అన్నారు. ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు వాహనాలకు ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇసుక బుకింగ్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య తలెత్తినప్పుడు, దానిని వెంటనే పరిష్కరించాలని.. దాని కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎరవత్రి అనిల్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!







