మేలో తగ్గిన ట్రాఫిక్‌ ఉల్లంఘనలు

- July 02, 2016 , by Maagulf
మేలో తగ్గిన ట్రాఫిక్‌ ఉల్లంఘనలు


ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ ఏడాది మే నెలలో 142,215 ట్రాఫిక్‌ ఉల్లంఘనల్ని నమోదు చేసింది. ఈ సంఖ్య గత ఏడాతో పోల్చితే 4.7 శాతం తక్కువ. నిన్న విడుదలైన ఖతార్‌ నెలవారీ గణాకాంల్లో ఈ విషయం వెలుగు చూసింది. ఇందులో రాడార్‌ గుర్తించిన నిబంధనలే అత్యధికం. వీటి సంఖ్య 77,793. ఏప్రిల్‌తో పోల్చితే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌లోనూ పెరుగుదల కన్పించింది. వీటి సంఖ్య 7,536. అలాగే 1,760 వాహనాల్ని నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా సీజ్‌ చేయబడ్డాయి. లైసెన్స్‌ లేకుండా డ్రైవింగ్‌ చేయడం, అలాగే నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడం వంటి నిబంధనల కారణంగా వీటిని సీజ్‌ చేశారు. ఇంకో వైపున 26 మోటర్‌ సైకిల్స్‌ కూడా సీజ్‌ చేయబడ్డాయి. 2016లో ఖతార్‌ జనాభా 2.59 మిలియన్లకు చేరుకుంది. గత ఏడాదితో పోల్చితే ఇది 8.96 శాతం ఎక్కువ. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com