ఫిబ్రవరి 16న మస్కట్‌లో హిందూ మహాసముద్ర సదస్సు..!!

- February 13, 2025 , by Maagulf
ఫిబ్రవరి 16న మస్కట్‌లో హిందూ మహాసముద్ర సదస్సు..!!

మస్కట్: 8వ హిందూ మహాసముద్ర సదస్సు (ఐఓసీ) కార్యకలాపాలు ఫిబ్రవరి 16న మస్కట్‌లో ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల ఈవెంట్‌ను ఒమన్ నిర్వహిస్తుంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రాతినిధ్యం వహిస్తుంది.  "వోయేజ్ టు న్యూ హారిజన్స్ ఆఫ్ మారిటైమ్ పార్టనర్‌షిప్" అనే థీమ్ కింద నిర్వహిస్తున్నట్లు కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీ షేక్ ఖలీఫా బిన్ అలీ అల్ హార్తీ తెలిపారు. విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసాయిదీ సదస్సును ప్రారంభిస్తారని, 60 దేశాలకు చెందిన మంత్రులు, అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు.  ఈ సదస్సుకు ఒమన్ ఆతిథ్యమివ్వడం హిందూ మహాసముద్రం ద్వారా దాని చరిత్ర, సముద్ర సంబంధాలను ప్రతిబింబిస్తుందని ఆయన వివరించారు. ఒమానీలు వందల సంవత్సరాలు సముద్రంలో ప్రయాణించి చైనా, భారతదేశం, తూర్పు ఆఫ్రికాకు చేరుకున్న నావికులు అని గుర్తుచేశారు. ఈ మహాసముద్రంపై ఆసక్తి ఉన్న దేశాలతో పాటు హిందూ మహాసముద్రం సరిహద్దులో ఉన్న దేశాల మధ్య వివిధ ఆర్థిక మరియు భద్రతా అంశాలలో సహకారాన్ని పెంపొందించుకోవడం ఈ సదస్సు లక్ష్యం అని అల్ హార్తీ తెలిపారు. దేశాల మధ్య సహకార విధానాలను అభివృద్ధి చేయడం, ఆర్థిక ప్రయోజనాలను పెంపొందించడం, సముద్ర వనరులను కాపాడుకోవడం, రవాణా మరియు సముద్ర భద్రతా సామర్థ్యాలను మెరుగుపరచడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశాలని  షేక్ అల్ హార్తీ వివరించారు.  

ఈ కార్యక్రమంలో ఇండియా ఫౌండేషన్ ప్రెసిడెంట్ రామ్ మాధవ్ పాల్గొన్నారు.  హిందూ మహాసముద్రం 3 బిలియన్ల జనాభా కలిగిన 36 దేశాలలో విస్తరించిందని, 70 శాతం సముద్ర వాణిజ్యం ఈ సముద్రం గుండానే సాగుతుందని ఆయన వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com