ఘోర ప్రమాదం..గ్యాస్ పేలుడుతో కుప్పకూలిన భవనం..!!

- February 13, 2025 , by Maagulf
ఘోర ప్రమాదం..గ్యాస్ పేలుడుతో కుప్పకూలిన భవనం..!!

మనామా: గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగా అరద్‌లో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా. పలువురు గాయపడ్డారు. పేలుడు ధాటికి రెస్టారెంట్‌, కమర్షియల్‌ స్టోర్‌ ఉన్న భవనం ధ్వంసమైంది.  బుధవారం రాత్రి 7:40 గంటలకు ప్రమాదం సంభవించింది. పబ్లిక్ సెక్యూరిటీ డిప్యూటీ చీఫ్ మేజర్ జనరల్  డాక్టర్ షేక్ హమద్ బిన్ మహ్మద్ అల్ ఖలీఫా మాట్లాడుతూ..ప్రమాదంలో ఒకరు మరణించగా, ఆరుగురు గాయపడ్డారని తెలిపారు. గాయపడిన వారిని కింగ్ హమద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను రక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.  

కాగా, ప్రత్యక్ష సాక్షులు పేలుడు తర్వాత జరిగిన విధ్వంసాన్ని వివరించారు. “మేము ఇంట్లో కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా పెద్ద పేలుడు వినిపించింది. ఏమి జరిగిందో అర్థం చేసుకోవడానికి మేము బయటికి పరుగెత్తాము. ఒక భవనం పూర్తిగా కుప్పకూలడం దిగ్భ్రాంతి కలిగించింది.’’ అని ఒక ప్రత్యక్ష సాక్షి వివరించారు. “మేము ప్రధాన రహదారికి చేరుకున్నాము. శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ప్రయత్నించాము. కూలిపోయిన భవనం , గాయపడిన వారిని చూశాము. సివిల్ డిఫెన్స్ సిబ్బంది వచ్చే వరకు వేచి ఉండడం తప్ప మేం ఏమీ చేయలేకపోయాం.’’ అని మరోకరు తెలిపారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com