రియాద్ వేదికగా డిసెంబర్‌లో గ్లోబల్ ఎయిర్‌పోర్ట్స్ ఫోరమ్‌..!!

- February 13, 2025 , by Maagulf
రియాద్ వేదికగా డిసెంబర్‌లో గ్లోబల్ ఎయిర్‌పోర్ట్స్ ఫోరమ్‌..!!

రియాద్: ఈ ఏడాది డిసెంబర్‌లో గ్లోబల్ ఎయిర్‌పోర్ట్స్ ఫోరమ్ 4వ ఎడిషన్‌కు రియాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. రియాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఫోరమ్ డిసెంబర్ 16-17 తేదీల్లో జరుగుతుంది. గతంలో సౌదీ ఎయిర్‌పోర్ట్ ఎగ్జిబిషన్‌గా పిలిచే ఈ ఫోరమ్ గ్లోబల్ ఎయిర్‌పోర్ట్స్ ఫోరమ్‌గా రీబ్రాండ్ మార్పుచేశారు.  300 గ్లోబల్ ఎగ్జిబిటర్లు, 15,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ సంవత్సరం ఎడిషన్ నిర్వహిస్తున్నారు.  దాదాపు 100 మంది అంతర్జాతీయ వక్తలు, గ్లోబల్ ఏవియేషన్ ఇష్యూస్ కాన్ఫరెన్స్, జనరల్ అసెంబ్లీ ఆఫ్ ఉమెన్ ఇన్ ఏవియేషన్, ఎయిర్‌పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డ్స్‌తో సహా అనేక కార్యక్రమాలు జరుగనున్నాయి.  విమానయానంలో తాజా సాంకేతికతలు, ఆవిష్కరణలు,  వ్యూహాత్మక భాగస్వామ్యాలను ప్రదర్శించడానికి ఫోరమ్ ఒక ప్రత్యేక వేదకిగా నిలుస్తుంది.  వాయు రవాణా,  విమానాశ్రయ శ్రేష్ఠతకు గ్లోబల్ హబ్‌గా సౌదీ అరేబియా స్థానాన్ని ఈ ఫోరమ్ మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.

"విస్తరణ, ఆవిష్కరణ, సహకారం" అనే థీమ్‌తో ఎగ్జిబిషన్ 2024 ఎడిషన్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమంలో 22 దేశాల నుండి 7,000 మంది విమానయాన నిపుణులు, 250 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.

సౌదీ అరేబియా $147 బిలియన్ల పెట్టుబడులతో భారీ విమానాశ్రయ విస్తరణ, ఆధునీకరణ కార్యక్రమాలను అమలు చేస్తోంది. 2037 నాటికి ఈ రంగం GDPకి $82.3 బిలియన్ల సహకారం అందించగలదని అంచనా వేస్తున్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com