140 కోట్లకు మహేష్ బాబు సినిమా రైట్స్ కైవసం చేసుకోనున్న రిలయన్స్
- July 02, 2016
ప్రిన్స్ మహేష్ బాబుకి రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ గట్టి షాక్ ఇచ్చింది. అయితే ఇది మహేష్ బాబు కి ఏ మాత్రం నష్టం చేకూర్చేది కాదు. మహేష్ బాబు ని సైతం షాక్ అయ్యేలా చేసిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ అసలు ఏం చేసిందనేది ఇప్పుడు ఓ సారి చూద్దాం. బ్రహ్మోత్సవం పరాజయం తరువాత మహేష్ బాబు చేస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనుందనే విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ మూవీకి సంబంధించని స్టోరీ, స్క్రీన్ ప్లే అంతా పక్కాగా రెడీ అయ్యాయి. ఇక జూలై నెల మధ్యలో ఈ సినిమాని మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ సైతం ముహుర్తం పెట్టుకుంది. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో స్టార్ కాంబినేషన్ సైతం నేషనల్ మార్కెట్ లో వాల్యూ పెంచేలా ఉన్నాయి. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ పరిణితీ చోప్రా నటిస్తుంది.
అలాగే దర్శకుడు, నటుడు ఎస్.జె. సూర్య మెయిన్ విలన్ గా నటిస్తున్నారు. తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఇటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ, అటు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హై ఎక్స్ పెక్టేషన్స్ పెరగటంతో...ఈ మూవీ మార్కెట్ పై కార్పోరేట్ సంస్థల కన్ను పడింది.
ఆ విధంగా రిలయన్స్ ఎంర్టైన్మెంట్ సంస్థ...ఈ మూవీ నిర్మాతలతో చర్ఛలు జరిపి దాదాపు 140 కోట్ల రూపాయలకి డీల్ కుదుర్చుకున్నట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. ఇందులో థియోటర్స్ రైట్స్, డిజిటల్ రైట్స్ ని రిలయన్స్ చేజిక్కించుకుందని అంటున్నారు. ఈ డీల్ వివరాలను తెలుసుకున్న మహేష్ బాబు ఒక్కసారిగా షాక్ అయ్యాడని ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్స్.
తాజా వార్తలు
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్







