హైదరాబాద్ టు బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- February 17, 2025
హైదరాబాద్: తెలంగాణ నుంచి కర్నాటక రాజధాని బెంగళూరుకు ప్రయాణం చేసే వారికి టీజీఎస్ ఆర్టీసీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ నుంచి బెంగళూరు మార్గంలో ప్రయాణించే వారికి చార్జీల్లో ప్రత్యేక డిస్కౌంట్ ఇచ్చింది. ఆ మార్గంలో ప్రయాణించే వారికి 10శాతం రాయితీ కల్పిస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ వెల్లడించింది. బెంగళూరుకు నడిచే అన్ని సర్వీసులకు ఈ డిస్కౌంట్ వర్తింపు ఉంటుంది.
ఏసీ స్లీపర్ (బెర్త్), ఏసీ స్లీపర్ స్టార్ (సీటర్), రాజధాని, నాన్ ఏసీ స్లీపర్ (బెర్త్), నాన్ ఏసీ సీటర్, సూపర్ లగ్జరీ బస్సుల్లో ఈ ప్రత్యేక రాయితీ ఉంటుంది. ఈ డిస్కౌంట్ తో ఒక్కొక్కరికి 100 రూపాయల నుంచి 160 రూపాయల వరకు ఆదా అవుతుందని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. ప్రయాణికులు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ కోరింది. ఈ డిస్కౌంట్ కు సంబంధించి మరిన్ని వివరాల కోసం, టికెట్ రిజర్వేషన్ కోసం ఆర్టీసీ వెబ్ సైట్ http://www.tgsrtcbus.inను సంప్రదించాలంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బెంగళూరు ఒకటి. ఐటీ హబ్ గా బెంగళూరుకు గుర్తింపు ఉంది. అక్కడో ఎన్నో ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. ఇక, హైదరాబాద్ నుంచి నిత్యం ఎంతో మంది తరుచుగా బెంగళూరు వెళ్లి వస్తుంటారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







