న్యూజెర్సీలో NATS ఆర్ధిక అవగాహన సదస్సు

- February 17, 2025 , by Maagulf
న్యూజెర్సీలో NATS ఆర్ధిక అవగాహన సదస్సు

అమెరికా: ఫిబ్రవరి 15: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ న్యూజెర్సీ, శనివారం నాడు ఆర్ధిక అవగాహన సదస్సు నిర్వహించింది. న్యూజెర్సీలో ఉండే తెలుగు వారికి ఆర్ధిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ఏజీ ఫిన్ టాక్స్ సీఈఓ అనిల్ గ్రంధి తెలుగు వారికి ఎన్నో విలువైన ఆర్ధిక సూచనలు చేశారు.అమెరికాలో పన్నులు,ఉద్యోగం చేసే వారికి ఎలాంటి పన్ను మినహాయింపులు ఉన్నాయి? అకౌంటింగ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అధిక పన్నుల నుంచి తప్పించుకోవచ్చు? వ్యాపారాలు చేసే వారు పన్నుల విషయంలో ఎలా వ్యవహారించాలి ఇలాంటి అంశాలను అనిల్ గ్రంధి చక్కగా వివరించారు.ఈ  సదస్సులో పాల్గొన్న వారు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు ఇచ్చి వారి సందేహాలను నివృత్తి చేశారు.ఈ ఆర్ధిక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడంలో నాట్స్ ప్రెసిడెంట్ ఎలక్ట్ శ్రీహరి మందాడి కీలక పాత్ర పోషించారు. తెలుగువారికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలను నాట్స్  చేపడుతుందని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా నాట్స్ విద్య, వైద్యం,ఆర్ధికం, క్రీడలు ఇలా ఎన్నో అంశాలపై కార్యక్రమాలు చేపట్టనుందని శ్రీహరి మందాడి వివరించారు.

నాట్స్ బోర్డు డైరెక్టర్ బిందు ఎలమంచిలి,వైస్ ప్రెసిడెంట్(ఆపరేషన్స్) శ్రీనివాస్ భీమినేని, నేషనల్ కో-ఆర్డినేటర్M(మార్కెటింగ్) కిరణ్ మందాడి, zonal వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, న్యూ జెర్సీ చాప్టర్ నుండి మోహన్ కుమార్ వెనిగళ్ల, శ్రీకాంత్ పొనకాల,వెంకటేష్ కోడూరి, రాకేష్ వేలూరు,కృష్ణ సాగర్ రాపర్ల, రామకృష్ణ బోను,వర ప్రసాద్ చట్టు, జతిన్ కొల్ల, బ్రహ్మనందం పుసులూరి,బినీత్ చంద్ర పెరుమాళ్ళ, ధర్మ ముమ్మడి, అపర్ణ గండవల్ల, రమేష్ నూతలపాటి, రాజేశ్  బేతపూడి, గోపాల్ రావు చంద్రలు పలు కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారు.

ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని,నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com