నవీ ముంబైలో అమ్మవారి ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరిన టీటీడీ చైర్మన్
- February 18, 2025
తిరుమల: నవీ ముంబైలో అమ్మవారి ఆలయం,టీటీడీ సమాచార కేంద్రం నిర్మించేందుకు స్థలం కేటాయించాలని కోరుతూ టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ద్వారా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు వినతి పత్రం అందజేశారు.
సోమవారం సాయంత్రం తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ సెంటర్ లో మూడు రోజుల పాటు జరగనున్న కుంభ్ ఆఫ్ టెంపుల్స్ సదస్సు తొలిరోజు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, గోవా సీఎం ప్రమోద్ సావంత్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లతో కలిసి టీటీడీ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నవీ ముంబైలో అమ్మవారి ఆలయం, టీటీడీ సమాచార కేంద్రం నిర్మాణాలకు కొంత స్థలం కేటాయించాలని మహారాష్ట్ర సీఎం కు టీటీడీ చైర్మన్ వినతి పత్రం అందజేశారు.
ఇప్పటికే నవీ ముంబైలో ఉల్వే ప్రాంతంలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం 3.61 ఎకరాల స్థలాన్ని లీజు ప్రాతిపదికన కేటాయించారని ఈ సందర్భంగా ప్రస్తావించారు.మరో 1.50 ఎకరాల స్థలంలో అమ్మవారి ఆలయాన్ని కూడా నిర్మించాలని టీటీడీ నిర్ణయించిందని, ఈ మేరకు స్థలాన్ని కేటాయించాలని, బాంద్రాలో టీటీడీ సమాచార కేంద్రానికి కూడా కొంత స్థలాన్ని కేటాయించాలని టీటీడీ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







