వైభవంగా BAPS హిందూ మందిర్ మొదటి వార్షికోత్సవం..!!
- February 18, 2025
అబుదాబి: అబుదాబిలోని BAPS హిందూ మందిర్ తన మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. యూఏఈ మంత్రి అయిన హిస్ ఎక్సెలెన్సీ షేక్ నహయాన్ మబారక్ అల్ నహయాన్ హాజరయ్యారు. 450 మంది ప్రముఖులు, రాయబారులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. వీరితోపాటు ప్రెసిడెన్షియల్ కోర్ట్‌లోని ప్రత్యేక వ్యవహారాల సలహాదారు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ తహ్నూన్ అల్ నహ్యాన్ పాల్గొన్నారు. రాజకుటుంబానికి చెందిన 20 మందికి పైగా సభ్యులు, మంత్రులు హాజరయ్యారు. వేడుకలో 300 మంది కమ్యూనిటీ నాయకులు, వేలాది మంది హాజరయ్యారు.
వేడుకలు "మందిర్: ది హార్ట్ ఆఫ్ కమ్యూనిటీ" పేరుతో కార్యక్రమం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమయ్యాయి. యూఏఈలోని భారత రాయబారి, హిస్ ఎక్సలెన్సీ డా. సంజయ్ సుధీర్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ చైర్మన్ ముగీర్ ఖమీస్ అల్ ఖైలీ , అబుదాబి పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ హిస్ ఎక్సలెన్సీ జనరల్ అహ్మద్ సైఫ్ బిన్ జైటూన్ అల్ ముహైరి పాల్గొన్నారు.
గత సంవత్సరంలో మందిర్ సాధించిన విశేషమైన విజయాలను హైలైట్ చేస్తూ, సంవత్సరం-ఇన్-రివ్యూ వీడియోతో కార్యక్రమం ప్రారంభమైంది. తరువాత, ఐక్యత, సామరస్యం, సాంస్కృతిక అవగాహన , ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో మందిర్ ప్రభావం, ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ హిస్ ఎక్సెలెన్సీ షేక్ నహయాన్ మబారక్ అల్ నహయాన్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. విశ్వాసం, సేవ మార్గదర్శిగా మందిర్ పాత్ర గురించి ఆయన వివరించారు. ఇది సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చే అందమైన మందిరం అని కొనియాడారు.
ఇంటర్‌ఫెయిత్ హార్మొనీ విభాగంలో యూఏఈలోని బోహ్రా ముస్లిం కమ్యూనిటీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ముఫద్దల్ అలీ పాల్గొన్నారు. ఈ ప్రాంతంలోని అతిపెద్ద 3D-ప్రింటెడ్ వాల్‌ను విరాళంగా ఇవ్వడానికి మందిర్ స్ఫూర్తి తనను ఎలా ప్రేరేపించిందో, విభిన్న వర్గాలలో ఐక్యతను పెంపొందించడం ఎలా కొనసాగిస్తుందో తన అనుభవాలను పంచుకున్నారు.
ఇన్నర్ స్ట్రెంత్ సెగ్మెంట్‌కు వర్ధమాన టెన్నిస్ స్టార్ హర్ష్ పటేల్ నాయకత్వం వహించారు. అతను తన ప్రయాణంలో మందిర్ ప్రభావం, దాని ప్రశాంత వాతావరణం, ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా అతనికి మానసిక స్పష్టత, ఏకాగ్రత గురించి వివరించారు. స్వామి బ్రహ్మవిహారిదాస్ నేతృత్వంలో ఇన్నర్ హ్యాపీనెస్ అనే పేరుతో చివరి కార్యక్రమం జరిగింది. 2.2 మిలియన్ల మంది సందర్శకులు మందిరాన్ని సందర్శించారని, 1.3 మిలియన్ల మందికి ఉచిత భోజనం అందించామని, 20 వివాహాలు జరిగాయని తెలిపారు. గత సంవత్సరంలో మందిర్ విశేషమైన ప్రభావాన్ని ఆయన హైలైట్ చేశారు.



తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







