ఛాంపియన్స్ ట్రోఫీ 2025: షెడ్యూల్, ప్రైజ్ మనీ, ఫుల్ గైడ్..!!
- February 19, 2025
యూఏఈ: 'మినీ వరల్డ్ కప్' అని పిలువబడే ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ, ఎనిమిదేళ్ల జరుగుతుంది. 1998లో టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుండి అనేక మార్పులకు గురైన తర్వాత, 2017 ఎడిషన్ తర్వాత ఈ ఈవెంట్ ను అర్ధంతరంగా నిలిపివేశారు. కానీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)లో ఉన్న అధికారులు 2025లో టోర్నమెంట్‌ను పునరుద్ధరించాలని నిర్ణయించాయి.
టోర్నమెంట్ తేదీలు
- ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 19న ప్రారంభమై మార్చి 9 వరకు జరుగుతుంది.ఈ సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు పాకిస్తాన్, యూఏఈ రెండింటిలోనూ జరుగుతాయి.
టోర్నమెంట్‌లో పాల్గొనే జట్లు
- ఈ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్, ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ - ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి.
ఫార్మాట్
- ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు, ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని మరొక జట్టుతో ఆడుతుంది. రెండు గ్రూపుల నుండి మొదటి రెండు జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. మార్చి 9న జరిగే ఫైనల్ లాహోర్ లో జరుగుతుంది. కానీ ఇండియా టైటిల్‌కు చేరుకుంటే, ఫైనల్ దుబాయ్‌లో జరుగుతుంది. సెమీఫైనల్స్, ఫైనల్ రెండింటికీ రిజర్వ్ డేలు ఉంటాయి.
టోర్నమెంట్ ప్రైజ్ మనీ
- ఈ పోటీ మొత్తం బహుమతిగా $6.9 మిలియన్లు, ఇది 2017లో జరిగిన మునుపటి ఎడిషన్ కంటే 53% ఎక్కువ. విజేతకు $2.24 మిలియన్లు, రన్నరప్‌కు $1.12 మిలియన్లు అందుకుంటారు.
- షెడ్యూల్ (అన్ని మ్యాచ్‌లు యూఏఈ సమయం మధ్యాహ్నం 1 గంటలకు)
- ఫిబ్రవరి 19: పాకిస్తాన్ v న్యూజిలాండ్ (కరాచీ)
- ఫిబ్రవరి 20: బంగ్లాదేశ్ v ఇండియా (దుబాయ్)
- ఫిబ్రవరి 21: ఆఫ్ఘనిస్తాన్ v దక్షిణాఫ్రికా (కరాచీ)
- ఫిబ్రవరి 22: ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్ (లాహోర్)
- ఫిబ్రవరి 23: పాకిస్తాన్ v ఇండియా (దుబాయ్)
- ఫిబ్రవరి 24: బంగ్లాదేశ్ v న్యూజిలాండ్ (రావల్పిండి)
- ఫిబ్రవరి 25: ఆస్ట్రేలియా v దక్షిణాఫ్రికా (రావల్పిండి)
- ఫిబ్రవరి 26: ఆఫ్ఘనిస్తాన్ v ఇంగ్లాండ్ (లాహోర్)
- ఫిబ్రవరి 27: పాకిస్తాన్ v బంగ్లాదేశ్ (రావల్పిండి)
- ఫిబ్రవరి 28: ఆఫ్ఘనిస్తాన్ v ఆస్ట్రేలియా (లాహోర్)
- మార్చి 1: దక్షిణాఫ్రికా v ఇంగ్లాండ్ (కరాచీ)
- మార్చి 2: న్యూజిలాండ్ v ఇండియా (దుబాయ్)
- మార్చి 4: సెమీఫైనల్ 1 (దుబాయ్)
- మార్చి 5: సెమీఫైనల్ 2 (లాహోర్)
- మార్చి 9: ఫైనల్ (లాహోర్/దుబాయ్)
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







