సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్

- February 19, 2025 , by Maagulf
సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్

న్యూ ఢిల్లీ: భారత ఎన్నికల సంఘం నూతన సారథిగా జ్ఞానేశ్‌ కుమార్‌ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్‌ కుమార్‌ మంగళవారం పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో కొత్త సీఈసీగా జ్ఞనేశ్‌ కుమార్‌ ఇవాళ బాధ్యతలు తీసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ నిర్మాణానికి మొదటి అడుగు ఓటేన‌ని అన్నారు.

18ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడూ ఓటరుగా మారాలని పిలుపునిచ్చారు. ‘దేశ నిర్మాణంలో మొదటి అడుగు ఓటు వేయడమే. అందువల్ల 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడు ఓటరుగా మారాలి. ఓటర్లు ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేయాలి’ అని అన్నారు.

జ్ఞానేశ్‌ కుమార్‌.. కేరళ క్యాడర్‌కు చెందిన ‌1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం ఆయన వయసు 61 ఏండ్లు. 2019లో కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన సందర్భంలో ఆయన హోంమంత్రిత్వ శాఖలో (కశ్మీర్‌ డివిజన్‌) సేవలు అందించారు. 370 రద్దు కోసం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు అత్యంత సన్నిహితుడైన జ్ఞానేశ్‌.. హోం శాఖలో సంయుక్త కార్యదర్శిగా గతేడాది జనవరి 31న రిటైర్డ్‌ అయ్యారు. ఆ తర్వాత అదే ఏడాది మార్చిలో ఎన్నికల కమిషనర్‌ (ఈసీ)గా నియమితులయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com