పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం

- February 19, 2025 , by Maagulf
పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం

పామర్రు: పామర్రు నియోజవర్గ జనసైనికుల విస్తృతస్థాయి సమావేశం జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తాడిశెట్టి నరేశ్ కార్యాలయంలో  నియోజకవర్గ  మండల వివిధ స్థాయిల నాయకుల సమక్షంలో జరిగింది.

ఈసమావేశంలో బండి రామకృష్ణ మాట్లాడుతూ...పామర్రు నియోజకవర్గంలో 6,400ల పట్టభద్రుల ఓట్లు ఉన్నాయని ప్రతి ఓటు కూటమి అభ్యర్ధి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు నమోదు అయ్యేలా జనసేన పార్టీ శ్రేణులు బిజెపి, టిడిపి శ్రేణులను సమన్వయ పరుచుకుని పట్టభద్రుల కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని జనసేన పార్టీ శ్రేణులకు పార్లమెంట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయకర్త బండి రామకృష్ణ పిలుపునిచ్చారు.

పట్టభద్రుల ఎన్నికల నిర్వహణ అనుసరించాల్సిన విధానం పై పామర్రు జనశ్రేణులకు
నమూనా బ్యాలెట్ ను చూపుతూ బ్యాలెట్ MLC  ఓటు నమోదు పై అవగాహన కల్పించారు.
పార్లమెంట్ పట్టభద్రుల ఎన్నికల సమన్వయకర్తగా నా సహకారం అన్నివేళలా ఉంటుందని జన శ్రేణులకు రామకృష్ణ తెలిపారు.ఈ కార్యక్రమంలో పామర్రు నియోజవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ హోదాలో ఉన్న రాష్ట్ర, జిల్లా, మండల,నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com