అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!

- February 19, 2025 , by Maagulf
అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!

దోహా, ఖతార్: అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఇండియా పర్యటన విజయవంతమైంది. తన పర్యటనను ముగించుకొని  మంగళవారం న్యూఢిల్లీ నుండి బయలుదేరారు. హెచ్‌హెచ్ అమీర్ మరియు అతనితో పాటు వచ్చిన ప్రతినిధి బృందాన్ని పాలం ఎయిర్ బేస్‌లో విదేశాంగ మంత్రి హెచ్‌ఇ డా. సుబ్రహ్మణ్యం జైశంకర్, ఇండియాలో ఖతార్ రాయబారి HE మహమ్మద్ బిన్ హసన్ అల్ జాబర్, ఖతార్ లోని భారత రాయబారి  విపుల్, ఖతార్ రాయబార కార్యాలయ సభ్యులు వీడ్కోలు పలికారు.  ప్రధాన మంత్రి,  విదేశాంగ మంత్రి HE షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ,  అధికారిక ప్రతినిధి బృందం ఈ పర్యటనలో అమీర్‌తో కలిసి పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com