తక్కువ ధరలో ఐఫోన్ 16e.. యూఏఈలో ధర, ఫీచర్‌లు..!!

- February 20, 2025 , by Maagulf
తక్కువ ధరలో ఐఫోన్ 16e.. యూఏఈలో ధర, ఫీచర్‌లు..!!

యూఏఈ: మిడిల్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఎక్కువ వాటాను పొందేందుకు, శామ్‌సంగ్, చైనా హువావే వంటి ప్రత్యర్థుల నుండి పోటీని ఎదుర్కొనేందుకు ఆపిల్ సిద్ధమైంది. ఇందులో భాగంగా తక్కువ-ధర మోడల్‌ను ఐఫోన్ 16e గా విడుదల చేసింది. బడ్జెట్ సిరీస్ కోసం SE పేరుతో కొత్త ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  $599 ధరతో ఏఐ టెక్నాలజీతో..ఇది ChatGPTకి ఇంటిగ్రేటెడ్ యాక్సెస్‌ను కలిగుంది. యూఏఈలో ఇది Dh2,599 నుండి అందుబాటులో ఉంటుందని ప్రకటించారు.  ఐఫోన్ 16e ఆపిల్ తె C1 చిప్‌ను అమర్చారు.   తాజా తరం 6.1 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది.

ఆపిల్ ఐఫోన్ 16e ఫిబ్రవరి 21 నుండి (స్థానిక సమయం సాయంత్రం 5.00pm) యూఎస్, చైనా, ఇండియా, యూఏఈ సహా 59 దేశాలలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటుందని, ఫిబ్రవరి 28 నుండి షిప్‌మెంట్‌లు ప్రారంభమవుతాయని ఆపిల్ తెలిపింది.గత సెప్టెంబరులో విడుదల చేసిన ఐఫోన్ 16 చౌకైన వెర్షన్ కంటే దీని ధర దాదాపు $200 తక్కువగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com