దుబాయ్, షార్జా, అబుదాబి ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు..!!
- February 20, 2025
యూఏఈ: యూఏఈలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ తెలియజేసింది. షార్జా, దుబాయ్, రస్ అల్ ఖైమా, ఫుజైరా, ఖోర్ ఫక్కన్లోని కొన్ని ప్రాంతాలలో మోస్తరు నుండి తేలికపాటి వరకు వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర, తీరప్రాంత మరియు ద్వీప ప్రాంతాలలో వర్షపాతం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. వాతావరణం పాక్షికంగా మేఘావృతమై, ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని తీర ప్రాంతాలలో రాత్రి, శుక్రవారం ఉదయం వరకు పరిస్థితులు తేమగా ఉండే అవకాశం ఉంది. తేలికపాటి నుండి మోస్తరు గాలులు వీస్తాయని, గంటకు 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 32°Cకి చేరుకోవచ్చని, పర్వత ప్రాంతాలలో 11°C కనిష్ట స్థాయికి పడిపోవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







