చిరంజీవి మ్యారేజ్ డే.. మహేష్ బాబు పై ఫన్నీ కామెంట్స్
- February 20, 2025
మెగాస్టార్ చిరంజీవి మ్యారేజ్ డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. అది కూడా నేలపై కాదు. గాలిలో..యస్..ఆయన మ్యారేజ్ యానివర్సరీని స్పెషల్ ఫ్లైట్ లో జరుపుకున్నారు. అలా ఫ్లైట్ లో సెలబ్రేట్ చేసుకుని దుబాయ్ వెళ్లి అక్కడ పార్టీ జరుపుకోబోతున్నారు. అయితే ఈ పార్టీకి తన డియరెస్ట్ ఫ్రెండ్స్ ను కూడా తీసుకువెళ్లాడు. ఆ క్రమంలో ఫ్లైట్ లో ఉన్న సెలబ్రిటీస్ ను చూసి నెటిజన్స్ అంతా మహేష్ బాబుపై ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అదెలా అనుకుంటున్నారా.. సింపుల్. ఆ ఫ్లైట్ లో మహేష్ వైఫ్ నమ్రత ఉంది. కానీ అతను లేడు. మెగాస్టార్ తో పాటు అక్కినేని నాగార్జున, అమలతో పాటు నమ్రత కూడా ఉంది. అయితే మహేష్ బాబు కనిపించకపోవడంతో ఫ్యాన్స్ అంతా రాజమౌళి గురించి చెబుతూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం రాజమౌళి మహేష్ బాబు పాస్ పోర్ట్ ను తీసుకున్నాడు కదా. అప్పటి నుంచి అది అతని వద్దే ఉందేమో.. ఈ ట్రిప్ కు పాస్ పోర్ట్ ఇవ్వలేదేమో అందుకే మహేష్ ఈ ఫ్లైట్ లేడు అంటున్నారు. ఇంకొందరు పాపం నీకు వచ్చిన కష్టం ఇంకెవరికీ రాకూడదన్నా అంటూ మహేష్ ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. అయితే నిజంగానే ఈ ఫ్లైట్ లో మహేష్ లేడా లేక.. ఆయన లుక్ బయటకు వస్తుందని ఫోటోస్ లో స్కిప్ చేశారా అనేది తెలియదు కానీ.. కామెంట్స్ అయితే ఫన్నీగా ఉన్నాయి.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్