ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం

- February 20, 2025 , by Maagulf
ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ: ఢిల్లీ నూతన ముఖ్యమం త్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతోపాటు ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. రేఖ గుప్తా తో లెఫ్ట్ నేంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. 

నూతన ముఖ్యమంత్రి రేఖా గుప్తా,కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు మహిళ లకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందిస్తా మని ప్రకటించారు. మార్చి 8 లోపు నగదు జమ అవుతుందని, రేఖా గుప్తా చెప్పారు. 

మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్మించిన అద్దాల మేడ శీశ్ మహాల్ ను మ్యూ జియంగా మారుస్తామని చెప్పారు. ఆప్ ప్రభుత్వ పాలనను విమర్శించన రేఖా గుప్తా ప్రతి పైసాకు ఆప్ ఢిల్లీ ప్రజలకు లెక్క చెప్పాల్సి ఉంటుందన్నారు.

ఇక మీదట తాను ప్రజల మధ్యే ఉంటానని..నా బాధ్యతను నేను అత్యంత నిజాయితీగా నెరవేరుస్తా  నని చెప్పుకొచ్చారు. నేను ఢిల్లీ ముఖ్యమంత్రిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదని..నాపై నమ్మ  కం ఉంచి ముఖ్యమంత్రి బాధ్యతను నాకు ఇచ్చినందుకు ప్రధాని మోదీకి, బీజేపీ హైకమాం డ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com