తెలుగులోకి వస్తున్న తమిళ రొమాంటిక్ వెబ్ సిరీస్..
- February 21, 2025
మహత్ రాఘవేంద్ర, దేవిక, మానస చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ఎమోజీ. సెన్ రంగసామీ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఈ తమిళ రొమాంటిక్ సిరీస్ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఈ వెబ్‌సిరీస్‌ను అదే పేరుతో స్ట్రీమింగ్ చేయనుంది. ఫిబ్రవరి 28 నుంచి ఈ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.
తమిళంలో విడుదలైన రెండు సంవత్సరాల తెలుగులో వస్తుంది. ఓ జంట మధ్య ఏర్పడిన పరిచయం వివాహానికి ఎలా దారి తీసింది? ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయికి విడాకులు ఇచ్చి మరో అమ్మాయితో ఆ యువకుడు ఎందుకు జీవించాలని అనుకున్నాడు?
ఆ తరువాత విడాకులు తీసుకున్న అమ్మామే మళ్లీ అతడి జీవితంలోకి ఎలా వచ్చింది? అనే కాన్సెప్ట్‌తో ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందించారు. తమిళంలో ఈ వెబ్‌సిరీస్ మంచి ఆదరణను సొంతం చేసుకుంది.
కాగా..ఈ వెబ్‌సిరీస్ నటించిన మానస చౌదరి తెలుగు అమ్మాయి కావడం విశేషం. బబుల్‌గమ్ చిత్రంతో అమ్మడు టాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సుమ కనకాల కొడుకు రోషన్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ మూవీలోనూ ఓ కీలక పాత్రలో నటించింది మానస.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







