హైదరాబాద్ లో ఘనంగా 'పాటకు పట్టాభిషేకం' కార్యక్రమం

- February 21, 2025 , by Maagulf
హైదరాబాద్ లో ఘనంగా \'పాటకు పట్టాభిషేకం\' కార్యక్రమం

హైదరాబాద్: విఖ్యాత గాయకులు ఘంటసాల ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాటలు తెలుగు భాష కు వన్నె తెచ్చాయి అని వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు అన్నారు.వారి పాటలో మాధుర్యం మాత్రమే కాక తెలుగు భాష ఉచ్చారణ భాష లోని అందం శ్రోతలకు అందించిందని అయన పేర్కొన్నారు.అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవ సందర్భంలో వీరి పాటలు ఎంపిక చేసుకోవటం సముచితంగా ఉందన్నారు.శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై వంశీ ఇంటర్నేషనల్ (ఇండియా) నిర్వహణలో ప్రముఖ గాయకుడు దాసరి శ్రీహరి సారథ్యంలో పాటకు పట్టాభిషేకం పేరిట ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం సినీ గీతాలను వై.ఎస్ రామకృష్ణ ఇందునయన సురేఖ మధురంగా ఆలపించారు.శ్రీ హరి సహా గాయకులతో కలసి ఆలపించి వాడిన పూలే వికసించేనే పాటను సుమధుర స్వరంతో పాడారు అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వంశీ రామరాజు పాల్గొని గాయకులను సత్కరించి మాట్లాడారు నేటి వారికి ఘంటసాల పాటలు వినిపిస్తే తెలుగు భాష పై మక్కువ పెరుగుతుందని చెప్పేరు ఉత్తమ కార్యక్రమాలు చేసే వారికి వంశీ సంస్థల సహకారం అందిస్తామని తెలిపారు.సుధామయి వ్యాఖ్యానం చేసిన కార్యక్రమంలో సుంకరపల్లి శైలజ తదితరులు పాల్గొనగా లలిత కార్యక్రమ నిర్వహణ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com