అమెరికా ప్రొడక్ట్స్ పై ట్యాక్స్ తగ్గింపు...
- February 23, 2025
అమెరికా: ఇండియాపై పరస్పర టారిఫ్ లు కచ్చితంగా వేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మరికొన్ని అమెరికా ప్రొడక్ట్ లపై సుంకాలు తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. అయితే, ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించినా, లోకల్ తయారీ కంపెనీలకు ఎటువంటి నష్టం కలగని ప్రొడక్ట్ లపైనే సుంకాలు తగ్గించాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో సుంకాలు తగ్గించినా లోకల్ కంపెనీలకు ఎటువంటి నష్టం ఉండదనుకునే ప్రొడక్ట్ లను గుర్తించే పనిలో విధ మినిస్ట్రీలు ఉన్నాయి.
భారత్, అమెరికా దేశాల మధ్య కురదబోయే బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ (బీటీఏ)లో భాగంగా యూఎస్ నుంచి దిగుమతులను ఇండియా పెంచనుంది. ఇటీవల బీటీఏ చర్చల్లో ఇరుదేశాలుకూడా వ్యాపారాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లుకు పెంచుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాయి. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య జరుగుతున్న వ్యాపారంతో పోలిస్తే ఇది రెండింతలు ఎక్కువ. ఇందులోనూ తక్కువ వాల్యూమ్ లో జరిగే దిగుమతులపైనే ఎక్కువగా సుంకాలను తగ్గించాలని కేంద్రం చూస్తోంది. ఇప్పటికే ఆటో మొబైల్, ఆటో కాంపోనెంట్స్ వంటి సెక్టార్లలోని కంపెనీలతో చర్చ జరుపుతోంది. మరోవైపు వ్యవసాయ రంగం నష్టపోకుండా చూసుకోవడంపై ఎక్కువ ఫోకస్ పెట్టనుంది.
ప్రస్తుతం ఇండియా నుంచి ఏడాదికి రూ.1.2లక్షల కోట్ల విలువైన వెహికల్ పార్టులు యూఎస్ కు ఎగుమతి అవుతున్నాయి. వీటిపై అమెరికా ఎటువంటి ఇంపోర్ట్ డ్యూటీని వేయడం లేదు. అదే ఇండియా చేసుకుంటున్న ఆటో పోర్టుల దిగమతులపై 5శాతం నుంచి 15శాతం వరకు డ్యూటీ పడుతోంది. బీటీఏ చర్చల్లో ఇరు దేశాల ప్రతినిధులు ఈ అంశంపై చర్చించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







