కీల‌క మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్‌..

- February 23, 2025 , by Maagulf
కీల‌క మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్‌..

దుబాయ్: ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్లు దుబాయ్ వేదిక‌గా త‌ల‌ప‌డుతున్నాయి. ఈ డూ ఆర్ డై మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భార‌త తుది జ‌ట్టులో ఎలాంటి మార్పులు లేవు. బంగ్లాదేశ్‌తో ఆడిన జ‌ట్టునే కొన‌సాగిస్తున్నారు. అటు పాకిస్తాన్ జ‌ట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. ఫ‌ఖ‌ర్ జ‌మాన్ స్థానంలో ఇమామ్ ఉల్ హ‌క్ జ‌ట్టులోకి వ‌చ్చాడు.

ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాల‌ని భార‌త్ భావిస్తోంది.అటు ఈ మ్యాచ్‌లో పాక్ ఓడిపోతే మాత్రం ఆ జ‌ట్టు టోర్నీ నుంచి నిష్ర్క‌మిస్తుంది. దీంతో పాక్‌కు ఇది డూ ఆర్ డై మ్యాచ్‌గా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com