విదేశాల్లో కూడా తెల్లని పొడవాటి దుస్తులు వేసుకోకండి
- July 03, 2016
తెల్లని పొడవాటి దుస్తులు.. తలపై స్కార్ఫ్.. ఆపైన నల్లటి బ్యాండ్.. ఇవన్నీ వినగానే మనకు గుర్తొచ్చేది దుబాయ్ షేక్‌లే కదా. ప్రత్యేక వస్త్రధారణతో వారంతా ఏ ప్రదేశానికి వెళ్లినా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రజలని ఇట్టే గుర్తుపట్టొచ్చు. అయితే తమ దేశంలో అయితే సరేగానీ.. విదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం ఆ దుస్తులను వేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారట ఎమిరేట్స్ అధికారులు. ఇటీవల అలాంటి వస్త్రధారణ ఉన్న ఓ వ్యక్తిని అమెరికాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిగా అనుమానించడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారట. అసలేం జరిగిందంటే..
ఎమిరేట్స్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తను ఇటీవల అమెరికాలోని ఒహియో లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన వెళ్లిన ఓ హోటల్లోని క్లర్క్ అతడి వేషధారణ, భాషను చూసి ఉగ్రవాది అని అనుమానించింది. దీంతో ఆమె అత్యవసర నంబర్‌కు కాల్ చేయడంతో.. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. ఆయన ఓ వ్యాపారవేత్త అని తెలిసింది. ఈ ఘటన అనంతరం ఎమిరేట్స్ విదేశాంగ శాఖ ప్రజలకు కొన్ని సూచనలు చేసింది.
విదేశాలకు వెళ్లినప్పుడు ఆయా దేశాల చట్టాలను గౌరవించాలని.. అందుకోసం.. తమ వస్త్రధారణను పక్కన బెడితే తప్పేమీ లేదని తమ వెబ్సైట్లో చెప్పుకొచ్చింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







