యూఏఈలో రికార్డు స్థాయిలో 384 మరణాల నమోదు..!!

- February 27, 2025 , by Maagulf
యూఏఈలో రికార్డు స్థాయిలో 384 మరణాల నమోదు..!!

యూఏఈ: గత మూడేళ్లలో యూఏఈలో వాహనాల సంఖ్య పెరిగింది. అదే సమయంలో రోడ్డు ప్రమాదాలు, మరణాల కేసులు కూడా పెరిగాయి.  ఇటీవల అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) 'ఓపెన్ డేటా' గణాంకాలు వెల్లడించింది. గత సంవత్సరం మొత్తం 384 రోడ్డు మరణాలు నమోదయ్యాయి. 2023లో 352 మరణాలతో పోలిస్తే 32 కేసులు లేదా 9 శాతం ఎక్కువ. ఇది కూడా 2022లో నమోదైన 343 కంటే 12 శాతం ఎక్కువ లేదా 41 ఎక్కువ. గాయపడిన వారి సంఖ్య కూడా 2024లో 8.33 శాతం (గాయపడ్డవారు 6,032 )పెరిగింది. ఇది 2023లో 5,568 గా, 2022లో 5,045 గా ఉంది.   దాదాపు 68 శాతం మరణాలు పరధ్యానపు డ్రైవింగ్, టెయిల్‌గేటింగ్, నిర్లక్ష్యం, అజాగ్రత్త, లేన్ క్రమశిక్షణ పాటించకపోవడం వంటికారణాలతో జరిగాయి.  మరణాలలో 40 శాతం మంది 19 - 29 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఉన్నారు. 2023లో వీరి సంఖ్య38 శాతం.  గత సంవత్సరం 383,086 కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేయడంతో భారీగా కార్లు రోడ్లపైకి వచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు.

శుక్రవారం సాయంత్రం సమయం అత్యంత ప్రమాదకరమైన రోజుగా తెలిపారు. మరణాల పరంగా దు దుబాయ్ (158), అబుదాబి (123) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. 67 మంది మోటారుసైకిల్ రైడర్‌ల మరణించగా, మొత్తం మరణాలలో వీరిది 17.45 శాతం.  19 మైక్రో-మొబిలిటీ (ఇ-స్కూటర్) మరణాలు నమోదయ్యాయి.  రన్-ఓవర్ల వల్ల గత సంవత్సరం 61 మరణాలు(16 శాతం) మరణాలు సంభవించాయి.

రోడ్డు ప్రమాదాల పరంగా టాప్ 10 అత్యంత రహదారులు: షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్, ఎమిరేట్స్ రోడ్, అబుదాబి-అల్ ఐన్ రోడ్, షేక్ మక్తూమ్ బిన్ రషీద్ స్ట్రీట్, మెయిన్ స్ట్రీట్ (అబుదాబి-కమోడిటీస్), అల్ ఐన్-దుబాయ్ రోడ్, అల్ ఖైల్ స్ట్రీట్, దుబాయ్-హట్టా రోడ్, షేక్ జాయెద్ స్ట్రీట్.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com