రమదాన్: ప్రతిరోజూ 14వేల ఇఫ్తార్ భోజనాలు.. 200 మంది వాలంటీర్లు..!!

- March 01, 2025 , by Maagulf
రమదాన్: ప్రతిరోజూ 14వేల ఇఫ్తార్ భోజనాలు.. 200 మంది వాలంటీర్లు..!!

యూఏఈ: రమదాన్ సందర్భంగా ఉపవాసం ఉన్న వేలాది మంది ముస్లింలకు ఇఫ్తార్ విందులు అందించే సంప్రదాయాన్ని ఒక లాభాపేక్షలేని సంస్థ తిరిగి ప్రారంభించింది. 19 సంవత్సరాల క్రితం కేవలం 100 భోజనాలతో ప్రారంభమైన ఈ సంప్రదాయం, ఇప్పుడు దుబాయ్‌లోని తొమ్మిది శిబిరాల్లో రోజుకు 14వేల భోజనాలు అందించే స్థాయికి విస్తరించింది. వ్యాపారవేత్తలు, సీనియర్ మేనేజర్లు మరియు బ్లూ-కాలర్ వర్కర్లతో సహా అన్ని వర్గాల నుండి 200 కంటే ఎక్కువ మంది వాలంటీర్ల బృందం ఇందు కోసం పనిచేస్తుంది.  

మోడల్ సర్వీస్ సొసైటీ (MSS) అని పిలవబడే సంస్థ రమదాన్ సమయంలో అనే సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. 2006లో వాలంటీర్ షాజిల్ షౌకత్ (ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి),  మరికొంత మంది షార్జాలోని నేషనల్ పెయింట్స్ రౌండ్‌అబౌట్ దగ్గర దాదాపు 100 మంది కార్మికుల కోసం భోజనాలు అందించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా MSS వాలంటీర్లు తమ రమదాన్ సాయంత్రాలను ఈ సేవ కోసం కేటాయిస్తున్నారు. "గత 19 సంవత్సరాలుగా, నేను నా కుటుంబంతో కలిసి చేసిన ఇఫ్తార్‌ల సంఖ్య చాలా తక్కువ. కానీ వారు గొప్ప ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకున్నారు." అని షాజిల్ తెలిపారు.  గత ఏడాది సుమారు 400,000 ఇఫ్తార్ భోజనాలు పంపిణీ చేయగా, ఈ ఏడాది అర మిలియన్ల భోజనాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తమకు అండగా నిలిచిన వాలంటీర్లు, స్పాన్సర్‌లు, భాగస్వాములకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఈ చొరవ విద్యార్థులు, యువతతో సహా వాలంటీర్లకు ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొనడానికి, గోల్డెన్ వీసాను పొందడంలో సహాయపడే స్వయంసేవక గంటలను సంపాదించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని కూడా అందిస్తుంది. చాలా మంది కార్పొరేట్ వాలంటీర్లు సంవత్సరానికి వచ్చి చేరుతుంటారు. మొదటిసారిగా వాలంటీర్‌ల కోసం కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (CDA) వెబ్‌సైట్‌లో ఇప్పుడు రిజిస్ట్రేషన్‌లను ప్రారంభించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com