10 మిలియన్ దిర్హామ్‌ల చోరీ..ఇద్దరు నకిలీ పోలీసులు అరెస్ట్..!!
- March 01, 2025
దుబాయ్: క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) ఆఫీసర్లుగా నటించి నైఫ్‌లోని ఒక ట్రేడింగ్ కంపెనీ నుండి 10 మిలియన్ దిర్హామ్‌లు దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. అనుమానితులు ఇద్దరు ఆసియా జాతీయులు. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం.. నిందితులు అహ్మద్, యూసిఫ్ పోలీసు అధికారులమని చెప్పుకుంటూ కంపెనీలోకి ప్రవేశించారు. నకిలీ సీఐడీ గుర్తింపుకార్డును చూపి సిబ్బందితో గొడవకు దిగారు. నిందితులు ఐదుగురు ఉద్యోగులను కట్టివేసి, వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో ఉన్న నగదును తీసుకోని అక్కడి నుండి పరారయ్యరు. అనంతరం ఉద్యోగులు తమను తాము విడిపించుకొని, పోలీసులక సమాచారం అందజేశారు. నైఫ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, సీఐడీ, క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్, పెట్రోలింగ్ విభాగాల అధికారులు ఘటనాస్థలికి వచ్చి దర్యాప్తు చేపట్టారు. CCTV ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి, వారిని పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. అనుమానితులను ఉత్తర ఎమిరేట్‌లో అదుపులోకి తీసుకొని, నగదును స్వాధీనం చేసుకున్నారు. కంపెనీలో పనిచేసే ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో చోరీకి ప్లాన్ చేసినట్లు విచారణలో నిందితులు తెలిపారు. అనంతరం సదరు ఉద్యోగిని అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ, చట్టపరమైన చర్యల కోసం కేసును దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు సిఫార్సు చేశారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







