విజిట్ ఖతార్ ‘త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్’ ప్రారంభం..!!

- March 02, 2025 , by Maagulf
విజిట్ ఖతార్ ‘త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్’ ప్రారంభం..!!

దోహా, ఖతార్: విజిట్ ఖతార్ త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్ రెండవ ఎడిషన్ దోహా ఓల్డ్ పోర్ట్‌లో తిరిగి వచ్చింది. ఈ సంవత్సరం మరిన్ని ప్రత్యేకతలతో సందడి చేయనుంది.  ఈ ఫెస్టివల్ సాంప్రదాయ వంటకాలు, సాంస్కృతిక, వారసత్వాన్ని తెలియజేసేలా సందర్శకులకు ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది.

విజిట్ ఖతార్‌లో ఫెస్టివల్స్ & ఈవెంట్స్ డెలివరీ మేనేజర్ హమద్ అల్ ఖాజా మాట్లాడుతూ.. త్రోబాక్ ఫుడ్ ఫెస్టివల్ అనేది సాంప్రదాయ వంటకాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఇంటరాక్టివ్ పోటీలతో కూడిన వివిధ ఈవెంట్‌ల ద్వారా ఖతార్ వారసత్వాన్ని జరుపుకునే ఒక ప్రత్యేకమైన అనుభవం అని అన్నారు. ఈ సంవత్సరం హెరిటేజ్ మార్కెట్‌లు, సాంప్రదాయ ఆటలు, జానపద కథలు, ఖతార్ సాంస్కృతిక గుర్తింపును ప్రతిబింబించే కళాత్మక ప్రదర్శనలను కలపడం ద్వారా కార్యకలాపాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.       

త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్ అనేక కళాత్మక, సాంస్కృతిక కార్యక్రమాలను అందిస్తుంది. సందర్శకులు ‘కహూట్’ వంటి ఇంటరాక్టివ్ పోటీలను ఆస్వాదించవచ్చు. ఇందులో ప్రముఖ ఫుడ్, సాంప్రదాయ హస్తకళలు, వారసత్వ సంఘటనలపై ప్రశ్నలు ఉంటాయి. విజేతలకు విలువైన బహుమతులు, అలాగే ‘ట్రెజర్ హంట్’ పోటీలు పాల్గొనేవారిని హెరిటేజ్ పజిల్‌లను పరిష్కరించడానికి, వివిధ స్టాల్స్‌తో ఇంటరాక్ట్ అయ్యేందుకు అవకాశం లభిస్తుంది.  ఖతారీ వంటకాలను సృజనాత్మకతతో తయారు చేసేందుకు ‘లోకల్ ఫ్లేవర్ ఛాలెంజ్’లో చెఫ్‌లు పోటీ పడతారు. ప్రజలు ఉత్తమమైన వంటకాన్ని ఎంచుకునేందుకు ‘పీపుల్స్ టేస్ట్ ఛాలెంజ్’లో పాల్గొనవచ్చు.  'సీక్రెట్ ఇంగ్రెడియంట్ ఛాలెంజ్' కూడా ఉంటుంది. ఇందులో చెఫ్‌లు ఆశ్చర్యకరమైన పదార్థాలను ఉపయోగించి వంటలను సిద్ధం చేయాల్సి ఉంటుంది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com