ఆఫీసుకు రావాలా..అధిక జీతాలు, అదనపు ప్రయోజనాలు ఇవ్వండి..రిమోట్ ఉద్యోగుల డిమాండ్..!!

- March 04, 2025 , by Maagulf
ఆఫీసుకు రావాలా..అధిక జీతాలు, అదనపు ప్రయోజనాలు ఇవ్వండి..రిమోట్ ఉద్యోగుల డిమాండ్..!!

యూఏఈ: రిమోట్, హైబ్రిడ్ వర్క్ అనేది ఉద్యోగులకు మెరుగైన ఎంపికగా కొనసాగుతున్నంది. అయితే కంపెనీలు ఫుల్ టైం కార్యాలయానికి తిరిగి రావాలని కోరుకుంటే అధిక వేతనంతో సహా అదనపు ప్రయోజనాలను కల్పించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్-19 అనంతర కాలంలో ఈ డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఉద్యోగులు ఆరోగ్యకరమైన వర్క్ - లైఫ్ బ్యాలెన్స్ కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారని ఓ సర్వేలో వెల్లడైంది.

యూఏఈతోపాటు ప్రపంచవ్యాప్తంగా, ఉద్యోగులు మెరుగైన వర్క్-లైఫ్ సమతుల్యత కోసం హైబ్రిడ్ లేదా రిమోట్ వర్క్ మోడల్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పెరుగుతున్న జీవన వ్యయం మధ్య సౌకర్యవంతమైన వర్కింగ్ ఎంపికలు, మెరుగైన సాలారీలు అందించే యజమానులను ఇష్టపడతారు. 'ఫ్యూచర్ ఆఫ్ వర్క్' నిర్వహించిన JLL సర్వేలో 48 శాతం మంది మిడిల్ ఈస్ట్ పార్టిసిపెంట్స్ క్రమం తప్పకుండా ఆఫీసుకు హాజరయ్యే ఉద్యోగులకు వేర్వేరు ప్రయోజనాలు, జీతాలను పరిగణనలోకి తీసుకుంటారని తేలిందని JLLలో మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ఆఫీస్, బిజినెస్ స్పేస్, రిటైల్ హెడ్ డానా విలియమ్సన్ అన్నారు. "కంపెనీలు తిరిగి వచ్చి ఆఫీస్ నుండి పూర్తి సమయం పని చేయాలని కోరుకుంటే, ఉద్యోగులు ప్రయోజనాలను ఆశించడం దీనికి కారణం. ఈ ధోరణి వర్క్-లైఫ్ నిబద్ధతలను సమతుల్యం చేయాలనే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.”అని చెప్పారు.
ఉద్యోగులు మెరుగైన ఆరోగ్య బీమా, వెల్‌నెస్ కార్యక్రమాలు, జీతాల పెంపుదల కోసం అడుగుతున్నారని, అదే సమయంలో ప్రయాణానికి సంబంధించిన ఖర్చులు, పనితీరు ఆధారంగా అదనపు ఆర్థిక ప్రోత్సాహకాలను అందించాలని కోరుకుంటున్నారని సర్వే నివేదికలో పేర్కొన్నారు. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఈ డిమాండ్లకు ప్రతిస్పందిస్తున్నాయని. పెరుగుతున్న జీవన వ్యయాన్ని ఎదుర్కోవడానికి కంపెనీలు అధిక జీతంతోపాటు గృహ, రవాణా, పాఠశాల ఫీజు భత్యాలను పెంచుతున్నారని డానా వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com