మక్కాలో దంచికొడుతున్న వర్షాలు.. విద్యా సంస్థలకు సెలవులు..!!

- March 04, 2025 , by Maagulf
మక్కాలో దంచికొడుతున్న వర్షాలు.. విద్యా సంస్థలకు సెలవులు..!!

మక్కా: మక్కాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. వర్ష సూచన నేపథ్యంలో మక్కా నగరంలోని అన్ని పాఠశాలలతో పాటు అల్-జుముమ్, అల్-కామిల్, బహ్రా గవర్నరేట్‌లలో విద్యార్థులకు వ్యక్తిగత తరగతులను నిలిపివేస్తున్నట్లు మక్కా విద్యా శాఖ ప్రకటించింది. "నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ నివేదిక ఆధారంగా అందరి భద్రతను దృష్టిలో పెట్టుకొని, పవిత్ర రాజధానిలోని అన్ని పాఠశాలలు, అల్-జుముమ్, అల్-కామిల్ మరియు బహ్రా గవర్నరేట్‌లలో తరగతులను నిలిపివేయాలని నిర్ణయించారు. తరగతులు మద్రసతి ప్లాట్‌ఫామ్ ద్వారా రిమోట్‌గా నిర్వహించబడతాయి."అని ఒక ప్రకటనలో తెలిపింది.

మరోవైపు ఉమ్ అల్-ఖురా విశ్వవిద్యాలయం కూడా వ్యక్తిగత తరగతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తరగతులు రిమోట్‌గా జరుగుతాయని పేర్కొంది. ఇది నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ వాతావరణ సూచన ఆధారంగా ఉంది. మక్కా ప్రాంతంలోని అన్ని గవర్నరేట్‌లలోని విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయాలు, కళాశాలలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని విశ్వవిద్యాలయం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com