హత్య కేసులో మరో ఇద్దరు భారతీయులకు ఉరిశిక్ష అమలు..!!

- March 07, 2025 , by Maagulf
హత్య కేసులో మరో ఇద్దరు భారతీయులకు ఉరిశిక్ష అమలు..!!

యూఏఈ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో భారత జాతీయుడు షహజాది ఖాన్‌ను ఉరితీసిన కొన్ని రోజుల తర్వాత, హత్య కేసులో దోషులుగా తేలిన కేరళకు చెందిన మరో ఇద్దరు భారతీయులను ఉరితీశారు. వీరిని మహమ్మద్ రినాష్ అరంగిలోట్టు, మురళీధరన్ పెరుమ్‌తట్ట వలప్పిల్‌గా గుర్తించారు.ముహమ్మద్, మురళీధరన్ లు హత్యలకు పాల్పడినట్లు నిర్ధారించి యూఏఈలో మరణశిక్ష విధించారు. యూఏఈలోని అత్యున్నత న్యాయస్థానం, కోర్ట్ ఆఫ్ కాసేషన్, ఈ శిక్షలను సమర్థించింది.

ఇదిలా ఉండగా, మురళీధరన్ అంత్యక్రియలు ఈరోజు జరిగాయి. "భారతీయ పౌరుల కోసం యూఏఈ ప్రభుత్వానికి క్షమాభిక్ష పిటిషన్లు, క్షమాభిక్ష అభ్యర్థనలను పంపడం సహా అన్ని రకాల కాన్సులర్, చట్టపరమైన సహాయాన్ని భారత రాయబార కార్యాలయం అందించింది.ఈ రెండు శిక్షలను అమలు చేసినట్లు యూఏఈ అధికారులు 28 ఫిబ్రవరి 2025న రాయబార కార్యాలయానికి తెలియజేశారు" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది. సంబంధిత వ్యక్తుల కుటుంబాలకు సమాచారం అందించారు.

రాయబార కార్యాలయం వారితో సంప్రదింపులు జరుపుతోందని, అంత్యక్రియల్లో వారు పాల్గొనడానికి వీలు కల్పిస్తుందని MEA తెలిపింది.

భారతీయ జాతీయుడు ముహమ్మద్ రినాష్ అరంగిలోట్టు అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా అంతిమ నివాళులు అర్పించడానికి, ఖననం చేయడానికి ముందు ప్రార్థనలలో పాల్గొనడానికి హాజరయ్యారు." అని MEA తెలిపింది.
,ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాకు చెందిన 33 ఏళ్ల భారతీయ జాతీయురాలు షహజాది ఖాన్‌ను అబుదాబిలో ఖననం చేశారు. మృతుల ప్రతినిధులు ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు.

ఆమె యజమాని బిడ్డను చంపినందుకు దోషిగా నిర్ధారించబడిన తర్వాత ఆమెను ఉరితీశారు. యూఏఈ అధికారుల నిబంధనల ప్రకారం.. అబుదాబిలో అంత్యక్రియలు నిర్వహించబడ్డాయని విదేశాంగ శాఖ తెలిపింది.ఫిబ్రవరి 28న, యూఏఈ అధికారులు భారత రాయబార కార్యాలయానికి స్థానిక చట్టాల ప్రకారం షహజాది శిక్షను అమలు చేసినట్లు తెలియజేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com