అభివృద్ధి రాజకీయాలకు కేరాఫ్ పెమ్మసాని
- March 07, 2025
పెమ్మసాని చంద్రశేఖర్....చిన్న వయస్సులోనే వైద్య విద్యా రంగంలో కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించి ప్రజా సేవా చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలిచారు.తొలి ప్రయత్నంలోనే ప్రజల మద్దతు పొంది అధినేత చంద్రబాబు ఆశీస్సులతో కేంద్ర క్యాబినెట్‌లో చోటు సంపాదించారు. నేడు కేంద్ర గ్రామీణాభివృద్ధి & కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ జన్మదినం సందర్భంగా ఆయనపై ప్రత్యేక కథనం.
గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో 1976 మార్చి 7న పెమ్మసాని సాంబశివరావు, సువర్చల దంపతులకు చంద్రశేఖర్ జన్మించారు. చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మాజీ మంత్రి మరియు స్పీకర్ దివంగత కోడెల శివప్రసాద్ ముఖ్య అనుచరుడిగా ఉంటూ వచ్చిన ఆయన వ్యాపారరీత్యా మాచర్లలో స్థిరపడ్డారు. మాధురీ హోటల్ అధినేత మాధురీ సాంబయ్యగా పల్నాడు ప్రాంత ప్రజలకు చిరపరిచితులు.
చంద్రశేఖర్ 1993-94లో ఎంసెట్‌లో 27వ ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. పీజీ చదవడం కోసం 2000లో అమెరికాకు వెళ్లి పీజీ, 2005లో అమెరికాలోని పెన్సిల్వేనియాలోని గీసింజర్ మెడికల్ సెంటర్ నుంచి ఇంటర్నల్ మెడిసిన్‌లో ఎండీ పట్టా అందుకొని ఆ తరువాత జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీలో ఐదేళ్లపాటు టీచింగ్ ఫ్యాకల్టీగా పని చేశారు.
యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ పూర్తి చేసేందుకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు సహాయం చేస్తూ చాలా తక్కువకు తాను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ను ఆన్‌లైన్ లో అందించేవారు. ఆ ప్రయత్నానికి మంచి ఆదరణ దక్కడంతో చంద్రశేఖర్ రాసిన మెటీరియల్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆ తరువాత వైద్య విద్యార్థులకు ఆన్‌లైన్ శిక్షణ ఇచ్చేందుకు 'యు వరల్డ్' సంస్థను ప్రారంభించాడు. ఇందులో నర్సింగ్, ఫార్మసీ, న్యాయ, వాణిజ్యం, అకౌంటింగ్ విభాగాల్లో లైసెన్సింగ్ పరీక్షలకు శిక్షణ ఇచ్చేవారు. వారికి అద్భుతమైన మెటీరియల్ అందించేవారు. అలా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ అమెరికాలో ఒక యువ వ్యాపారవేత్తగా ఎదిగారు. ఇప్పటికీ వైద్య పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులకు యు వరల్డ్ ద్వారా ఆయన శిక్షణ అందిస్తున్నారు.
చంద్రశేఖర్ అమెరికా ఫిజీషియన్ అసోసియేషన్ లో సభ్యుడిగా ఉంటూ.. పెమ్మసాని ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి ఎన్నారైలకు ఉచిత వైద్య సేవలు అందించారు. వైద్య బీమా లేక ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయులకు అండగా నిలిచారు. తన వ్యాపారంలో రాణించిన ఆయన పురిటి గడ్డ కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్వదేశానికి తిరిగి వచ్చారు. పల్నాడు ప్రాంత వాసుల ప్రధాన సమస్యగా ఉన్న నీటి కొరతను తీర్చారు.
సొంత డబ్బులతో వందల సంఖ్యలో బోర్‌వెల్స్, ఆర్‌వోప్లాంట్స్ ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను అందించేలా బెస్ట్ బెరీ స్కూల్‌ను ప్రారంభించారు. పెమ్మసాని ట్రస్టు ఏర్పాటు చేసి.. పేద ప్రజలకు, స్వచ్చంద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తూ వస్తున్నారు.
తండ్రి సాంబశివరావు కరుడుగట్టిన తెదేపా నేతగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న గుర్తింపుతో పాటుగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే తపన ప్లస్ రాజకీయాలపై ఆసక్తితో తెదేపాలో చేరిన పెమ్మసాని 2024లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. పోటీ చేసిన మొదటిసారే ఎంపీగా మంచి మెజార్టీతో గెలవడంతో పాటుగా అధినేత చంద్రబాబు ఆశీస్సులతో మోడీ 3.0 ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి & కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఉద్ధండ రాజకీయ నేతల ఖిల్లాగా గుర్తింపు పొందిన గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికైన మొదటి రోజు నుంచే నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి తన టీంతో కలిసి పని చేయడం మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పాటుగా గ్రామీణాభివృద్ధి శాఖ లాంటి కీలకమైన మంత్రిత్వ శాఖకు తాను మంత్రిగా ఉండటంతో గుంటూరు నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయించారు. గుంటూరు పార్లమెంట్ సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న చంద్రశేఖర్ రాబోయే కాలంలో నియోజకవర్గానికి పలు కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టులను మంజూరు చేయించ బోతున్నారని సమాచారం.
ఎంపీగా గెలిచిన తొలిసారే కేంద్ర మంత్రి అయినప్పటికి తెదేపా అధినేత, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు తగ్గట్టుగా పనిచేస్తూ వివిధ మంత్రిత్వ శాఖల నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టంతో పాటుగా పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను రాష్ట్రానికి మంజూరు చేయించడంలో తన సహచర సభ్యుడు, కేంద్ర పౌరవిమానాయన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయడుతో చక్కగా సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నారు.రాబోయే రోజుల్లో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తన పనితీరుతో ప్రజలను మరింతగా ఆకట్టుకొని రాజకీయాల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్‌లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!