జర్మనీకి వెళ్లాల్సిన కొన్ని విమానాలను రద్దు చేసిన ఎమిరేట్స్..!!
- March 09, 2025
దుబాయ్: మార్చి 10న ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో కార్మికుల సమ్మె నేపథ్యంలో దుబాయ్ స్థానిక విమానయాన సంస్థ ఎమిరేట్స్ జర్మనీకి వెళ్లాల్సిన అనేక విమానాలను రద్దు చేసింది. విమానాశ్రయంలో 'ప్రణాళికాబద్ధమైన పారిశ్రామిక సమ్మె' కారణంగా విమానాలు ప్రభావితమయ్యాయని, జాప్యం వల్ల ప్రభావితమైన కస్టమర్లకు ఎమిరేట్స్ ఆటోమెటిక్ గా రీబుక్ చేసి తెలియజేస్తుందని ఎయిర్లైన్ తెలిపింది. సోమవారం జర్మనీలోని దాదాపు అన్ని విమానాశ్రయాలు 24 గంటల సమ్మె పరిధిలోకి రానున్నాయ. ఇది లక్షలాది మంది ప్రయాణికులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రేడ్ యూనియన్ వెర్డి ప్రభుత్వ రంగంలో, గ్రౌండ్ హ్యాండ్లింగ్లోని ఉద్యోగులు వాకౌట్ చేయాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







