తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ విడుదల..
- March 09, 2025
హైదరాబాద్: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఆచితూచి వ్యవహరించింది. ఢిల్లీ నుంచి ఫోనులో రాష్ట్ర నేతలతో కాంగ్రెస్ నేతలు మీనాక్షి నటరాజన్, కేసీ వేణుగోపాల్ సమాలోచనలు చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ నుంచి అభిప్రాయాలు సేకరించింది కాంగ్రెస్. చివరకు ఇవాళ అధికారికంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం అభ్యర్థులను ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన నేపథ్యంలో సీపీఐ అభ్యర్థిని ఆ పార్టీ ఖరారు చేయనున్నారు. హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ కార్యవర్గ సమావేశం జరుగుతోంది.
కాగా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో ఇవాళ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమావేశమై గంటన్నర పాటు చర్చించారు. తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలతో వారిద్దరు ఫోనులో మాట్లాడారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







