గద్దర్ అవార్డుల పై ప్రభుత్వం కీలక ప్రకటన
- March 11, 2025
హైదరాబాద్: గద్దర్ అవార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రెండు రోజుల్లో గద్దర్ అవార్డుల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఏప్రిల్ లో గద్దర్ అవార్డులను కళాకారులకు అందజేస్తామని ప్రకటించింది. కళాకారులను, వాగ్దేయకారులను తమ ప్రభుత్వం ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. గద్దర్ అవార్డులను సినీ కళాకారులకు ఇవ్వాలని సంకల్పించిందని ఆయన తెలిపారు. తెలుగు చలనచిత్ర పురస్కారాలకు సంబంధించిన విధివిధానాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించి, ఆమోదం తెలిపారు.త్వరలోనే అవార్డులకు చెందిన పూర్తి వివరాలను ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ఉగాది రోజున ప్రదానం చేసేందుకు నిర్ణయించినప్పటికీ.. పురస్కారాల కోసం వచ్చిన చిత్రాలను ఎంపిక చేయడానికి 30 రోజుల సమయం అయినా పడుతుందని ఎఫ్డీసీ...ముఖ్యమంత్రికి తెలియజేసినట్టు తెలుస్తోంది. వీటి ఎంపిక ప్రక్రియ పూర్తయి..వాటిని ప్రభుత్వానికి పంపి ఆమోద ముద్ర వేయించడానికి నెలరోజుల కంటే ఎక్కువ సమయమే పట్టనుండగా.. రానున్న ఉగాదికి అవార్డుల ప్రదానోత్సవం లేనట్టే అని తెలుస్తోంది.
ప్రతిష్టాత్మకంగా వేడుక
తొలిసారి నిర్వహిస్తున్న గద్దర్ అవార్డుల ఉత్సవం కావడం, తెలంగాణ ప్రభుత్వం వీటిని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకుంది. దిల్ రాజు ఉండడం వల్ల మొత్తం ఇండస్ట్రీ అంతా అవార్డుల ఫంక్షన్లో కనిపించడం గ్యారంటీగా కనిపిస్తోంది.ఈ వేడుకను ఎప్పుడు, ఎక్కడ అనేవి ఇతరత్రా వివరాలతో నోటిఫికేషన్ ఒకటి రెండు రోజుల్లో వస్తుంది. అప్పుడు అన్నీ తెలుస్తాయి. ఏ ఏడాదికి అవార్డులు ఇస్తారు? ఏ టైమ్ పీరియడ్ సినిమాలు తీసుకుంటారు? అన్నీ తెలిసిన తర్వాత వీటిపై మరింత స్పష్టత రానుంది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







