కువైట్ లోని సల్మియా ఐదవ రింగ్ రోడ్ టన్నెల్ ప్రారంభం..!!

- March 11, 2025 , by Maagulf
కువైట్ లోని సల్మియా ఐదవ రింగ్ రోడ్ టన్నెల్ ప్రారంభం..!!

కువైట్: సల్మియా వైపు ఐదవ రింగ్ రోడ్ ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్ అందుబాటులోకి వచ్చిందని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఈ ప్రాజెక్ట్ దేశంలోని రోడ్ నెట్‌వర్క్‌ను ఆధునీకరించడానికి, అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ఉంది. ఇది ముఖ్యంగా టన్నెల్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కువ ట్రాఫిక్ ఫ్లోను పెంచడానికి దోహదం చేస్తుందన్నారు. పబ్లిక్ వర్క్స్ మంత్రి డాక్టర్ నౌరా అల్-మిషాన్ ఇటీవల జహ్రా వైపు సొరంగంను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కొత్త టన్నెల్ ప్రారంభంతో కువైట్‌లో ట్రాఫిక్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి, రోడ్ల నాణ్యతను మెరుగుపరచడానికి కీలక అడుగుగా భావిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com