నీరసం తగ్గించే నేరేడు పండ్లు
- July 04, 2016
నేరేడుపండ్లు ప్రస్తుతం మార్కెట్‌లో విరివిగా దొరుకుతున్నాయి. నిగనిగలాడుతూ..నోరూరించే వీటిని ప్రతిరోజూ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా...
1. నే రేడు పండ్లు నుంచి క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం, విటమిన్ సి, థయామిన్, ఫోలిక్ యాసిడ్, పీచు, ప్రొటీన్లు, కెరొటిన్లు లభిస్తాయి.
2. మ ధుమేహం ఉన్నవారికి నేరేడు పండ్లు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు అదుపులోకి వస్తాయి. ఇందులోని పోషకాలు గ్లైసమిక్ ఇండెక్స్ శాతాన్ని సమతుల్యం చేస్తాయి. వీటిలోని సుగుణాలు.. జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేకూరుస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. రక్తశుద్ధీ జరుగుతుంది.
3. ర క్తహీనత సమస్య ఎదుర్కొంటున్న వారు ఈ పండును ఎంతŒ తింటే అంత మంచిది. నెలసరి సమయంలో బాగా నీరసపడిపోయే అమ్మాయిలు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందుతుంది. శరీరానికి సరిపడా ఇనుము అందుతుంది.
4. వం దగ్రాముల నేరేడు పండ్లలో యాభై ఐదు శాతం పొటాషియం ఉంటుంది. గుండె, మధుమేహం, రక్తపోటు ఉన్నవారు ఒక పండు తింటే సరిపోతుంది. అరుగుదల సరిగా లేనప్పుడు కప్పు పెరుగులో నాలుగు చెంచాల నేరేడు పండు రసం కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
5. చి గుళ్ల నుంచి రక్తం కారడం, దంతాలు పుచ్చిపోవడం.. దుర్వాసన రావడం వంటి సమస్యలకు నేరేడు పండ్లు చక్కటి పరిష్కారం. వీటిని నమిలినప్పుడు పులుపూ, తీపి, వగరు కలబోతగా ఉండే రసం బ్యాక్టీరియాలను దూరం చేస్తుంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
6. ఈ కాలంలో రోగనిరోధక శక్తి చాలా అవసరం ఈ పండు తీసుకోవడం వల్ల విటమిన్ సి అంది.. రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
7. నే రేడు పండ్లను ఎట్టి పరిస్థితుల్లో పరగడుపున తీసుకోకూడదు. తప్పనిసరిగా ఏదన్నా తిన్నాకే స్వీకరించాలి. ఇక శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు వైద్యుల సలహాలతో వీటిని తినవచ్చు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







