మారనున్న KBC హోస్ట్!

- March 12, 2025 , by Maagulf
మారనున్న KBC హోస్ట్!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్పతి’ (KBC) షోకు హోస్ట్‌గా గడిపిన సంవత్సరాలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రవేశాయి.అయితే, తాజా సమాచారం ప్రకారం, అమితాబ్ ఈ షో నుండి నెక్స్ట్ సీజన్ నుంచి తప్పుకోనున్నారు.ఆయన వైదొలిగే అవకాశం ఉందని సినీ వర్గాలు వెల్లడించాయి.

కొత్త హోస్ట్ ఎవరు?

బిగ్ బీ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దాని పై బాలీవుడ్‌లో హాట్ టాపిక్ నడుస్తోంది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, అందాల రాణి ఐశ్వర్య రాయ్, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం. వీరిలో ఎవరు హోస్టింగ్ బాధ్యతలు స్వీకరిస్తారో ఆసక్తిగా మారింది.

షారుఖ్ ఖాన్‌కు మరో అవకాశం?

ఇది మొదటిసారి కాదు, 2007లో అమితాబ్ బచ్చన్ స్థానంలో షారుఖ్ ఖాన్ ఒక సీజన్‌కి హోస్ట్‌గా వ్యవహరించారు.అయితే, ప్రేక్షకులకు షారుఖ్ హోస్టింగ్ పెద్దగా నచ్చకపోవడంతో తిరిగి అమితాబ్‌ను తీసుకొచ్చారు. అయితే, ఇప్పటి పరిస్థితుల్లో షారుఖ్ మళ్లీ ఈ అవకాశాన్ని పొందే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

అభిమానుల్లో ఆసక్తి

KBC షో పై అమితాబ్ ప్రభావం ఎంతటిదో అందరికీ తెలిసిందే. ఆయన హోస్టింగ్ లేకపోతే షో విజయవంతం అవుతుందా? కొత్త హోస్టుని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారన్న ప్రశ్నలు అనేకం మిగిలాయి.అయినప్పటికీ, బాలీవుడ్ నుంచి సీనియర్ స్టార్లు లేదా క్రికెట్ లెజెండ్స్ ఈ స్థానాన్ని చేపడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. KBC కొత్త సీజన్ ప్రకటించే వరకు దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com