ఐపీఎల్ 2025లో 10 జ‌ట్ల కెప్టెన్ల జాబితా

- March 14, 2025 , by Maagulf
ఐపీఎల్ 2025లో 10 జ‌ట్ల కెప్టెన్ల జాబితా

క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 సీజ‌న్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం ప‌ది ఫ్రాంచైజీలు క‌ప్పు కోసం పోటీప‌డుతున్నాయి. ముంబై, చెన్నై వంటి జ‌ట్లు ఇప్ప‌టికే ప‌లుమార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నాయి.ఢిల్లీ క్యాపిట‌ల్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు వంటి జ‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారి కూడా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడ‌లేదు.

ఈ నేప‌థ్యంలో ఈసారి అయినా త‌మ క‌ల‌ను నెర‌వేర్చుకోవాల‌ని ఢిల్లీ, ఆర్‌సీబీ వంటి జ‌ట్లు భావిస్తుండ‌గా.. మిగిలిన జ‌ట్లు కూడా ఐపీఎల్ ట్రోఫీ విజేత‌గా నిల‌వాల‌ని ఆరాట‌ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే ఐపీఎల్ 18వ సీజ‌న్ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో తొలి మ్యాచ్ కోల్‌క‌తా నైట్‌రైర్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది.మార్చి 22న కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

ఇక తాజాగా శుక్ర‌వారం (ఢిల్లీ క్యాపిట‌ల్స్‌) త‌మ జ‌ట్టు కెప్టెన్ ను ప్ర‌క‌టించింది.ఆల్‌రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ ను కెప్టెన్‌గా నియ‌మించింది. దీంతో అన్ని జ‌ట్లు కెప్టెన్లను ప్ర‌క‌టించిన‌ట్లైంది. మ‌రి ఏ జ‌ట్టుకు ఎవ‌రు కెప్టెన్‌గా ఉన్నారో ఓ సారి చూద్దాం..

ఐపీఎల్ 2025లో 10 జ‌ట్ల కెప్టెన్ల జాబితా ఇదే..

  • ముంబై ఇండియ‌న్స్–హార్దిక్ పాండ్యా
  • రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు–ర‌జ‌త్ పాటిదార్‌
  • స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్–పాట్ క‌మిన్స్‌
  • చెన్నై సూప‌ర్ కింగ్స్–రుతురాజ్ గైక్వాడ్‌
  • కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్–అజింక్యా ర‌హానే
  • ల‌క్నో సూప‌ర్ జెయింట్స్–రిష‌బ్ పంత్
  • పంజాబ్ కింగ్స్–శ్రేయ‌స్ అయ్య‌ర్‌
  • రాజ‌స్థాన్ రాయ‌ల్స్–సంజూ శాంస‌న్‌
  • ఢిల్లీ క్యాపిట‌ల్స్–అక్ష‌ర్ ప‌టేల్‌
  • గుజ‌రాత్ టైటాన్స్–శుభ్‌మ‌న్ గిల్‌

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com