ప్రపంచ మార్కెట్ ధరల ఆధారంగా.. బహ్రెయిన్‌లో పెట్రోల్ ధరలు సర్దుబాటు..!!
- March 14, 2025
మనామా: బహ్రెయిన్ లో పెట్రోల్ ధరను ప్రపంచ మార్కెట్ ధరలకు అనుగుణంగా సర్దుబాటు చేయనున్నారు. అదే సమయంలో అర్హత కలిగిన పౌరులకు ఆర్థిక సహాయం అందించబడుతుందని పేర్కొన్నారు. 2025–2026 రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి ప్రభుత్వం , శాసనసభ అధికారుల మధ్య ఈ వారం జరిగిన చర్చల సందర్భంగా ఈ ప్రతిపాదిత ఫ్రేమ్‌వర్క్ పై చర్చించారు. అవసరమైన వస్తువులు , సేవలలో స్థిరత్వాన్ని కొనసాగిస్తూ సబ్సిడీలను ప్రత్యక్ష ఆర్థిక సహాయంగా మార్చే ప్రణాళికలపై సమీక్షించారు. ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG), సాంప్రదాయ బేకరీలకు కిరోసిన్, మత్స్యకారులకు డీజిల్ కోసం సబ్సిడీలు మారవని పేర్కొన్నారు. వచ్చే రెండు సంవత్సరాలలో విద్యుత్, నీటి మౌలిక సదుపాయాలలో BD400 మిలియన్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు తెలిపారు.
‘సిటిజెన్ అకౌంట్’
‘సిటిజెన్ అకౌంట్’ ద్వారా మొదటి ఇళ్లలో విద్యుత్, నీటి బిల్లులకు సహాయం చేయడానికి ఒక కార్యక్రమం ప్రవేశపెట్టనున్నారు. ఇది అర్హత, చెల్లింపు విధానాలను నిర్వచించడానికి శాసనసభ్యులతో సమన్వయంతో నిర్మించబడుతుంది. ఆదాయం, లాభం ఆధారంగా కార్పొరేట్ ట్యాక్స్ స్లాబ్ ను పరిశీలిస్తున్నారు. బహ్రెయిన్ నివాసితులకు ఉపాధి అవకాశాలను కాపాడటానికి నిర్దిష్ట రంగాలకు మినహాయింపు ఇవ్వబడుతుందని ఆర్థిక, జాతీయ ఆర్థిక మంత్రి షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా చెప్పారు. వ్యయ తగ్గింపులు, చమురుయేతర ఆదాయం పెరుగుదల ద్వారా ఫిస్కల్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత బహ్రెయిన్ ప్రాథమిక బడ్జెట్ మిగులును సాధించిందని ఆయన గుర్తించారు. ప్రతినిధుల మండలి స్పీకర్ అహ్మద్ అల్ ముసల్లం బడ్జెట్ చర్చలు జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ఉపాధి అవకాశాలను పెంచడం, స్థిరమైన ఆర్థిక వృద్ధిని నిర్ధారించడంపై ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఆర్థిక సర్దుబాట్లు
షురా కౌన్సిల్ చైర్మన్ అలీ బిన్ సలేహ్ అల్ సలేహ్ కీలక సేవలను, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్వహించడానికి ఆర్థిక సర్దుబాట్లను జాగ్రత్తగా నిర్వహించాలని వెల్లడించారు. 2024లో వ్యాపారాలు, నివాసితులు, సందర్శకులు 92 శాతం వసూళ్లకు దోహదపడ్డారని గణాంకాలు చెబుతున్నాయని, అయితే 94 ముఖ్యమైన వస్తువులు, 1,300 ప్రభుత్వ సేవలపై VAT మినహాయింపుల కారణంగా తక్కువ, మధ్యతరగతి ఆదాయం కలిగిన బహ్రెయిన్ పౌరులు కేవలం 2 శాతం మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. విలువ ఆధారిత పన్ను (VAT) ఆదాయాన్ని కూడా ఈ సందర్భంగా వారు సమీక్షించారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







