వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకున్న2400 జంటలు..!!

- March 15, 2025 , by Maagulf
వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకున్న2400 జంటలు..!!

యూఏఈ: ఇప్పటివరకు దాదాపు 2,400 జంటలు వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకున్నారు. వీరిలో 92% అనుకూలంగా ఉన్నట్లు అబుదాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ కూడా అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రకటించారు. ఆయన అధ్యక్షత ప్రారంభమైన ఎమిరేట్స్ జీనోమ్ కౌన్సిల్ సమావేశం నవజాత జన్యు పరీక్షల కోసం కార్యక్రమాలను ఆమోదించింది. యూఏఈ జీనోమ్ ప్రోగ్రామ్‌లో పెద్దలకు విస్తరించిన జన్యు పరీక్ష, సంతానోత్పత్తి, గుండె సంబంధిత జన్యు పరీక్షలు నిర్వహిస్తారు.

ప్రీమేరిటల్ జెనెటిక్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్‌ను జనవరి 1, 2025 నుండి ఆరోగ్య, నివారణ మంత్రిత్వ శాఖ ఇతర భాగస్వాముల సహకారంతో అమల్లోకి తీసుకొచ్చింది.  ఇందులో భాగంగా ఇప్పటివరకు 2,428 జంటలకు పరీక్షలు చేయించింది. 840 కంటే ఎక్కువ జన్యు రుగ్మతలతో ముడిపడి ఉన్న 570 జన్యువుల సమగ్ర జన్యు పరీక్ష ద్వారా 92 శాతం కంటే ఎక్కువ జన్యుపరంగా అనుకూలంగా ఉన్నట్లు గుర్తించింది. 

వంశపారంపర్య వ్యాధుల నుండి రక్షించడం, కుటుంబ నియంత్రణలో సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి జన్యు డేటాను ఉపయోగించుకునేలా జంటలకు మేలు చేయడంతోపాటు రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్ధారించడం ఈ కార్యక్రమం లక్ష్యమని వెల్లడించారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com