పోర్న్ మేగజైన్సే అతని ప్రాణాలు తీశాయి!
- March 04, 2017జపాన్‌లో ఓ వ్యక్తికి వింత మరణం సంభవించింది. ఒకేసారి ఆరుటన్నుల పోర్న్ మ్యాగజైన్లు మీద పడటంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో ముచ్చటపడి పోగుచేసుకున్న పోర్న్ పుస్తకాలే ఆయన ప్రాణాలు తీయడం గమనార్హం. కాగా, జపాన్‌కి చెందిన సదరు వ్యక్తి కుటుంబం ఈ విషయం దాచిపెట్టేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
స్థానిక మీడియా కథనం ప్రకారం.. మృతుడికి 50 యేళ్లు ఉంటాయి. పుస్తకాలు దాచిన గదిలో.. ఓ మూల నుంచి మేగజైన్లు మొత్తం ఒకేసారి మీదపడడంతో అతడు మరణించాడు. శ్వాస ఆడక లేదా గుండెపోటు రావడం వల్ల చనిపోయిన ఉంటాడని భావిస్తున్నారు. జపాన్‌లోని అతని ప్లాట్‌లో ఈ ఘటన జరిగి ఆరు నెలల అవుతున్నా.. అధికారులకు కూడా తెలియలేదు.
అయితే, అతడి కుటుంబం ఈ ఘటనను తెలివిగా దాచే ప్రయత్నంచేసింది. కొందరు కూలీలను మాట్లాడుకుని గుట్టుచప్పుడు కాకుండా పోర్న్ మేగజైన్లను తొలగించింది. అయితే చిందరవందరగా ఉన్న అపార్ట్మెంటు ఫోటోలు ఓ కూలీద్వారా బయటికి రావడంతో అసలు విషయం వెలుగుచూసింది.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..