ఆరుగురు హీరోయిన్లు, ఆరుగురు హీరోలతో బోయపాటి సినిమా
- March 24, 2017మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను.. అసలు బోయపాటి శ్రీను సినిమా అంటేనే.. భారీ తారాగణం.. భారీ సెటింగ్స్.. పాత్ర చిన్నదైనా సరే ఆ పాత్ర కధను ప్రభావం చేస్తుంది అనుకొంటే.. ఆ పాత్రల కోసం బోయపాటి బాగా తెలుసున్న నటీనటులనే ఎంచుకొంటాడు. తాజాగా బోయపాటి శ్రీను బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమాలో మొత్తం ఆరుగురు హీరోలు.. ఆరుగురు హీరోయిన్లు నటిస్తుండడం విశేషం,... అంటే.. ఈ సినిమాలో శ్రీనివాస్ తో కలిపి వివిధ పాత్రలు కోసం మొత్తం ఆరుగురు హీరోలు, ప్రధాన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో కలిపి ఆరుగురు హీరోయిన్లను నటింపజేస్తున్నాడట. శ్రీనివాస్ కాకుండా ఒకప్పుడు హీరోలుగా చేసిన జగపతి బాబు, శరత్ కుమార్, సుమన్ లతో పాటు ఈ తరం హీరోలు నందు, శశాంక్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక హీరోయిన్ల లో రకుల్ కాకుండా మరొక హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్, ఐటెమ్ సాంగ్ లో కేథరిన్ చేస్తోండగా... కీలక పాత్రలో అలనాటి హీరోయిన్ వాణి విశ్వనాథ్, సితార లతో పాటు "భీమవరం బుల్లోడు" ఫేమ్ ఎస్తర్ నొరోన్హా నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశాలో ఉన్న ఈ సినిమాను ద్వారకా క్రియెషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..